Sunday, February 16, 2014

కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఛీ కొడుతున్నారు

లోక్‌సభలో గురువారం జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఛీ కొడుతున్నారు. గురువారం సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేశారు. సోమవారం సీమాంధ్ర మంత్రులను గెంటేస్తారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి రాజగోపాల్, వేణుగోపాల్‌రెడ్డిపై పిడిగుద్దులు గుద్దారు. రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడకుంటే తెలంగాణ బిల్లు గురువారమే పాస్ అయి ఉండేది. కేంద్రానికి దమ్ముంటే లోక్‌సభలో సిసి కెమెరాల ఫుటేజిలు బయటపెట్టాలి. అప్పుడు వాస్తవాలు వెలుగుచూస్తాయి. కాంగ్రెస్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’ అని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాయలసీమలో కాంగ్రెస్‌కు కొండంత అండగా నిలిచిన కోట్ల తొలిసారి సొంత పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. శుక్రవారం కర్నూలులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో పలు వివాదాస్పద బిల్లులను తప్పుబట్టిన రాహుల్ గాంధీ టి. బిల్లుపై నోరు మెదపకపోవడం రాజకీయమంటూ నిప్పులు చెరిగారు. సోనియాకు తెలియకుండా ఇదంతా జరిగిందనుకోవడానికి వీలులేదన్నారు. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ మంత్రివర్గ సహచరులే వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలపడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. కేంద్ర మంత్రివర్గంలోని సీమాంధ్ర మంత్రులను సోమవారం సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు న్నాయని వెల్లడించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి సీమాంధ్ర ఎంపీలపై భౌతికదాడులు చేయించారని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల ఎంపీలతో పిడిగుద్దులు గుద్దించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేకే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వినియోగించారన్నారు. రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడి గందరగోళం సృష్టించకపోయి ఉంటే తెలంగాణ బిల్లు గురువారమే పాస్ అయి ఉండేదని కోట్ల స్పష్టం చేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు కాపీలు కూడా లేకుండా హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నోటి మాట ద్వారా లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొనడం ఏంటని కోట్ల ప్రశ్నించారు. బిల్లుకు ఎంతమంది మద్దతు ఉందో తెలుసుకోవాలన్న నిబంధన ఉండగా దాన్ని కాదని స్పీకర్ మీరాకుమార్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు. తెలుగుదేశం ఎంపి వేణుగోపాల్ కత్తి తీసుకువచ్చారని కమల్‌నాథ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోట్ల అన్నారు. సభలో గందరగోళం జరిగి అంతా బయటకు వచ్చిన తరువాత మేధావిగా చెప్పుకునే తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి చేసిన వాఖ్యలు బెదిరించేవిగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులపై బాంబులు వేస్తే తప్ప అడ్డు తప్పుకోరంటూ జైపాల్ హెచ్చరించడం విచారకరమన్నారు.
బిల్లు విషయంలో కాంగ్రెస్, బిజెపి కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడిందే కానీ సొంత మంత్రుల మాట వినడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని మండిపడ్డారు. కెసిఆర్‌ను నమ్ముకున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిండా మునిగిపోయిందని అన్నారు. సభలో జరిగిన వాస్తవాలను బయటకు వచ్చి చెప్పకుండా జగన్ వౌనం దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఉన్న నాయకులు, కార్యకర్తలు నేడు ఆ పార్టీ అంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ వ్యూహానికి ప్రతి వ్యూహం రచించి బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడమే తమ తదుపరి కర్తవ్యమని కోట్ల స్పష్టం చేశారు

Thursday, February 13, 2014

ప్రేమికుల రోజు దినోత్సవాన్ని బహిష్కరించండి

విదేశి సంస్క్సతి నుండి భారతదేశాన్ని కాపాడండి

తాను ప్రేమించింది తనకు దక్కకుండా పోయిందని - ఆమె ముఖంపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు!
తన ప్రేమను అంగీకరించలేదని - ఒక అమాయకురాలిని హతమార్చిన నరరూప రాక్షసుడు!
పెద్దలు కాదన్నారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు!
తాను కోరినవాడు కాక, మరొకరు లభించినందుకు ఆత్మహత్య చేసుకున్న వనిత! మరొకరి కాపురంలో నిప్పులు పోసిన యువతి!
- ఇవి ఇంచుమించు అనునిత్యం వినవచ్చే వార్తలు!
ఎడతెరపిలేని ’ఎపిసోడ్ల సీరియల్స్’ విషసర్పాల వేల కోరలు!!
స్త్రీపురుష సంబంధాలలో ధర్మసూత్రం తెగడం చేత, నిబద్ధతలో పవిత్రత లోపించడం చేత - భారతీయ సమాజంలో చెలరేగుతున్న అమానుష చర్యలు!
వీటికి మన సనాతన ధర్మ సాహితిలో ఉన్న పరిష్కారం ఏమిటి?
స్త్రీ పురుష సంబంధం ఒక చిత్రమైన అంశం
దీనిపై ఆధారపడి ధర్మాధర్మాలు వర్ధిల్లుతాయి. అందుకే ఈ సంబంధం పైననే రాజ్యాలు, హింసలు, కథలు, కావ్యాలు పుట్టి పెరుగుతున్నాయి.
పరస్పరాకర్షణతో కూడిన కామం ’ప్రేమ’ అనే పేరుతో వివిధ పోకడలతో ప్రపంచవ్యాప్తంగా గాథలుగా ప్రసిద్ధిచెందినది. ఈ బంధంలోని పవిత్రత, అపవిత్రత - అనేవి ధర్మపరిమితుల బట్టి నిర్దేశించాలి.
మన ప్రాచీన పురాణ గ్రంథాలలో ప్రేమగాథలు లెక్కలేనన్ని, దైహిక కామం మాత్రమే ప్రేమలోని అంశం కాదు. మానసికమైన అనురాగం, దృఢమైన అనుబంధం, ఒకరి క్షేమం కోసం ఒకరి త్యాగం - ఉత్తమ ప్రేమలోని అంశాలు, వీటితో కూడిన దైహిక కామం పవిత్రమైనదే.
స్త్రీ పురుష కామ సంబంధంపైనే మానవ సమాజాభివృద్ధి ఆధారపడి ఉంది. హితకరమైన ధార్మిక సంతానోత్పత్తికి - ’దాంపత్యధర్మం’ అనే గొప్ప వ్యవస్థను ఆవిష్కరించింది మన సంస్కృతి. ధర్మపు హద్దులలోని ప్రేమ మహోన్నతమైనది.
వివాహానంతరం అన్యోన్య ప్రేమయే ప్రధానమైనది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులది ప్రేమతత్త్వమే, సీతారాముల తత్త్వమూ ఇదే.
రురు-ప్రమద్వరలు, నల దమయంతులు, సావిత్రీ-సత్యవంతులు, శకుంతలా-దుష్యంతులు, వీరందరివీ ప్రేమ కథలే. అయితే ఇవి వికృతమైనవి కాక, ధర్మబద్ధమై జీవితపు విలువల్ని విస్మరించనివి కనుక ’దివ్యం’గా భాసిస్తున్నాయి. ప్రమద్వర పాము కరచి మరణించగా, రురుదు విలపిస్తాడు. తన తపశ్శక్తి చేత తిరిగి ఆమెను బ్రతికిస్తాడు. తన ఆయువులో కొంత ధారపోయడం చేత ఆమెను బ్రతికించుకోగలిగాడు.
దేవతలు తనను వరించినప్పటికీ, తాను నలునే ప్రేమించిన కారణంగా వారిని ప్రార్థించింది దమయంతి. సర్వాత్మనా నలుడే తనకు వరుడని భావించింది. దేవతలు కరుణించి వారికి వివాహం చేశారు. చక్కని వారి దాంపత్యంలో విధి వక్రించి, కలిపురుషుని ప్రభావం చేత విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. సంపదలను కోల్పోయి ఎడబాటుకి గురయ్యారు. కానీ దమయంతి తన ప్రేమ బలంతో భర్తను కాపాడగలిగింది.
సత్యవంతుడు ఏడాది లోపల మరణిస్తాడని తెలిసినప్పటికీ, సావిత్రి మనస్సు అతనికే అంకితం చేసినందున అతనినే వివాహమాడింది. తన తపస్సుతో అతనిని జీవింపజేసింది. మృత్యువునే జయించింది. స్వచ్ఛమైన ప్రేమకి భగవంతుని సహాయం ఉంటుందని దీని ఆంతర్యం.
శకుంతలను చూడగానే ప్రేమభావం కలిగినప్పటికీ, ’ఈమె తనకు తగిన క్షత్రియ కన్య కనుకనే తనకీమెపట్ల ప్రేమ కలిగి ఉంటుందని’ భావించిన దుష్యంతుడు ఆమె వివరాలు తెలుసుకుంటాడు. ఇది ధర్మసంహితమైన ప్రేమయే అని నిశ్చయించి, తన ధర్మానికి తగినట్లుగా వివాహమాడాడు. ఆపై శాపవశాత్తూ విస్మృతి ఏర్పడినా శకుంతల పట్టుదలతో వారి ప్రేమ జయించింది.
ఇలాంటి కథలు ధార్మిక వాజ్ఞ్మయంలో చాలా ఉన్నాయి. అయితే ఆ ప్రేమ కథలను ఆదర్శంగా చూపించడం మానివేసి, ఉద్రేక స్వభావాలతో జీవితం విలువలను తెలియని అపరిపక్వ మనోవికారాలనే - గొప్ప ప్రేమకథలుగా చిత్రించడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. వీటి ప్రభావం సమాజంపై పడింది.
సీతారాముల సంబంధం దివ్యమైనది. అయితే తనదికాని సీతను రావణుడు కామించడం అధర్మమైనది.
హద్దులు దాటిన కామాన్నే ’ప్రేమ’ అనడం దోషం, పెద్దల్ని క్షోభపెట్టి, సంప్రదాయపు మూల్యాలను నష్టపరచి కేవలాకర్షణతో కలసిన ప్రేమ కథలు వైఫల్యాలను పొందడం అధిక సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.”నా ప్రేమను కాదన్నందుకు హింసించాను - చంపుతాను’ అనే ’అసురబుద్ధి’కి ప్రేమ పదమే కూడదు. అదే అసురకామం.
’ధర్మవిరుద్ధం కాని ప్రేమ నా స్వరూపం’ అని భగవానుని మాట (గీత).
అధర్మకామం రాక్షసం. తనను వలచని దానిని తాను కామించడం మహాపాపం. అంబాంబికాలనే బాలికలను స్వయంవరవేళ జయించి తెచ్చిన భీష్ముడు, అంబ మరొకరిని వరించిందని తెలిసి, ’అన్యపురుషలగ్నమైన మనస్సు’ (ఇతరులను వలచిన మనస్సు) కలదానిని మరొక వివాహం చేయరాదని, విడిచిపెట్టాడు. ఆ తరువాతి కథ వేరే సంగతి.
మరొకరి సొమ్ము అయిన స్త్రీని హింసించడం నాశన హేతువు. సీతను చెరబట్టిన రావణుడు కూడా ’యాసిడ్ పోయడం’ లాంటి నీచకృత్యాలు చేయలేదు. అయినప్పటికీ ఆమెను బాధపెట్టినందుకు సమూల నాశనాన్ని పొందాడు.
ప్రేమపేరుతో హత్యలు, ఆత్మహత్యలు అధికం కావడం - సామాజిక రుగ్మతలు ఎంతగా బలీయమయ్యాయో చాటి చెప్తోమ్ది. విద్యార్థి దశనుండే ప్రాచీన ధర్మాల విలువలను, మానవ సంబంధాలలోని నైతికతను, సంప్రదాయాల ఔన్నత్యాన్నీ, జీవితం గొప్పతనాన్నీ - చాటిచెప్పే పద్ధతి ఉన్నప్పుడు యువతలో ఈ మనోవికారాలుండవు.
ఇందులో తల్లిదండ్రులకీ, ఉపాధ్యాయులకీ బాధ్యత ఉంది. బాల్యం నుండే రామాయణ, భారతాది కథలని -ధార్మిక కోణంలో చెప్పి, జీవితం కన్నా గొప్పది ఏదీ లేదని బోధించాలి.
మానవుడు సాధించవలసిన ఎన్నో ఔన్నత్యాలున్నాయి. వాటిముందు ఈ కామ సంబంధాలు అత్యల్పమైనవి.
రావణుడు, కీచకుడు, సైంధవుడు - వంటి అసురపాత్రలు స్త్రీ కామనతో, అనుచితంగా ప్రవర్తించి సర్వనాశనమైన ఉదాహరణలు.
వారిని ’ప్రేమికులు’ అనరు. స్త్రీ పట్ల గౌరవం కలిగేలా సంస్కారాలను ఆదినుంచే అందించాలి. ప్రాచీన గ్రంథాలను మతగ్రంథాలుగా భావించి, వాటినుండి జీవితపాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయని కారణంగా ఈ దుస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ధనార్జనే లక్ష్యంగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ, వికృత మానసిక ధోరణుల కల్పి కథలను కళలుగా ఆదరిస్తున్న కారణంగా ఈ మానసిక రుగ్మతలు ప్రబలుతున్నాయి.
దాంపత్య ధర్మబద్ధమైన ప్రేమయే ఆదర్శం.
ఆకర్షణ జనితమై, విలాస ప్రాధాన్యమైన ప్రేమలు వ్యక్తులకీ, సమాజానికీ కూడా హానికరాలు.
ఈ పరమ సత్యాన్ని గ్రహించేలా యువతరాన్ని తీర్చిదిద్దాలి. విద్యావ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, మాధ్యమరంగ, మేధావివర్గం, కూడా ఈ ధార్మిక దృక్పథాన్ని వ్యాప్తం చేయగలిగినప్పుడే - ఆరోగ్యవంతమైన భావితరం ఏర్పడుతుంది.

Telanagana Bill - అసలు ఏమి జరిగింది (13/Feb/2014)

ఉదయం 11 గంటలకు సభ మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందంటే...

ఉదయం 11 గంటలు..
లోక్‌సభ ప్రారంభంకాగానే బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ షార్మిన్ చౌదరిని స్పీకర్ మీరాకుమార్ సభ్యులకు పరిచయం చేశారు. అప్పటికి ఐదు నిమిషాలు గడిచాయి. వెంటనే గందరగోళం మొదలైంది. ప్రశ్నోత్తరాల సమయంలో... మొదటి ప్రశ్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీది. ఆయన్ను మాట్లాడాలని స్పీకర్ కోరుతుండగానే సీమాంధ్ర ఎంపీలు లగడపాటి, బాపిరాజు, సబ్బంహరి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, శ్రీనివాసులురెడ్డి, హర్ష కుమార్, సాంబశివరావు, మోదుగుల, కొనకళ్ల, శివప్రసాద్, కిష్టప్ప, జగన్, రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా వెల్‌లోకి వచ్చారు. దీంతో స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. వెల్‌లోకి ఎందుకు వెళుతున్నారంటూ పురందేశ్వరిని వయలార్ రవి ప్రశ్నించారు. ఇందుకు ఆమె తీవ్రంగా స్పందించారు. 'నా సహచర మంత్రుల్ని అడగండి తెలుస్తుంది' అంటూ పురందేశ్వరి ఘాటుగా బదులిచ్చారు.

11.50 గంటలు..
సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా కాంగ్రెస్ అధిష్ఠానం 'పకడ్ - బందీ' వ్యూహం మొదలైంది. రాష్ట్రంలోని తెలంగాణ ఎంపీలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 30 మంది సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోకుండా... మొదటి వరుస బెంచీల వద్దకు వచ్చారు. రాజ్‌బబ్బర్, డీకే సురేశ్, మాణిక్ సర్కార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఎనిమిది మంది స్పీకర్ పోడియం ఎడమవైపున నిలబడ్డారు. అజారుద్దీన్, చిత్తన్, విశ్వనాథం, ఆరుణ్ యూసుఫ్, తెలంగాణకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియానికి కుడి వైపున.. హోం మంత్రి షిండే చుట్టూ నిలబడ్డారు. లాల్ సింగ్ సహా మరికొందరు మొదటి బెంచీలో కూర్చున్న చిదంబరం పక్కన దారిలో... ఎవ్వరూ వెల్‌లోనికి వెళ్లకుండా అడ్డంగా ఉన్నారు.

11.57 గంటలు..
స్పీకర్ సభలోకి రాకమునుపే రగడ మొదలైంది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు మోదుగుల, శివప్రసాద్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మోదుగులను కోమటిరెడ్డి గట్టిగా పట్టుకున్నారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలూ ఆయన్ను చుట్టుముట్టారు. అయినప్పటికీ మోదుగుల తప్పించుకుని... లోక్‌సభ సెక్రటరీ జనరల్ మైకు పట్టుకుని లాగారు. దీంతో మైక్ పైభాగం విరిగిపోయి ఆయన చేతిలోకి వచ్చింది. సెక్రటరీ జనరల్ ముందు ఉన్న రీడింగ్ గ్లాస్‌ను ఆ మైకుతో బాదడంతో అది పెద్దశబ్దంతో బద్దలైంది. అప్పటి వరకూ సుష్మాస్వరాజ్ వైపు ఉన్న నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లు వచ్చి మోదుగులతో కలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ తెలంగాణ ఎంపీలు మోదుగులను చుట్టుముట్టి భౌతిక దాడికి దిగారు. రాజ్‌బబ్బర్, రమేశ్ రాథోడ్, నామా, సురేశ్, మాణిక్ సర్కార్, పొన్నం, «ద్రువ నారాయ ణ, వినోద్ పాండే, మందా జగన్నాథంలు మోదుగులపై చేయి చేసుకున్నారు.

11.58 గంటలు..
సభ మొత్తం అవాక్కైపోయింది. అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు అందరి చూపులు 'వెల్'వైపు కేంద్రీకృతమయ్యాయి. టీడీపీ సీమాంధ్ర ఎంపీలు కొనకళ్ల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప అప్రమత్తమై... మోదుగులకు రక్షణగా వెళ్లారు. ఆయనను చుట్టుముట్టిన రమేశ్ రాథోడ్, పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, «ద్రువ నారాయణ తదితరులను పక్కకు లాగేశారు. ఈ క్రమంలో శివప్రసాద్‌కూ దెబ్బలు తగిలాయి.

11.59 గంటలు..
అధికార పక్షం వైపు నుంచి వెల్‌లోకి వచ్చిన లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగారు. తన ఎదురుగా సెక్రటరీ జనరల్ ముందు ఉన్న ల్యాప్‌టాప్‌ను ఆయన విసిరికొట్టారు. మోదుగులపై దాడిని అడ్డుకునేందుకు ఆయన వైపు పరుగుతీశారు. ఇంతలో కాంగ్రెస్ ఎంపీలు అరుణ్ యూసుఫ్, పొన్నం, సుఖేందర్ రెడ్డి, మందాలు లగడపాటిని గట్టిగా పట్టుకున్నారు. బాగా ఎత్తుగా, బలంగా ఉన్న అరుణ్ యుసుఫ్ తన చేతుల్లో లగడపాటిని బంధించేశారు. క్షణాల్లో మిగతా ఎంపీలు లగడపాటిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆయన కింద పడ్డారు. అయినప్పటికీ లేచి వారిని గట్టిగా ప్రతిఘటించారు.

మధ్యాహ్నం 12.00 గంటలు..
సభలో తీవ్ర గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్ సభలో ప్రవేశించారు. స్పీకర్ వచ్చీ రాగానే 'ఐటమ్ నంబర్ 20ఎ - శ్రీ సుశీల్‌కుమార్ షిండే' అని ప్రకటించారు. 'నేను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ప్రవేశపెడుతున్నా ను' అని ఆయన ప్రకటిస్తుండగానే స్పీకర్ అందిపుచ్చుకుని.. '(సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు) అనుకూలంగా ఉన్న వాళ్లు 'అవును' అనొచ్చు.. లేనివాళ్లు 'కాదు' అనొచ్చు. 'అవును' అన్నారనే నేను భావిస్తున్నాను' అని ప్రకటించారు.

మధ్యాహ్నం 12.00 గంటలు..
ఇటు... సభలో గొడవ జరుగుతూనే ఉంది. లగడపాటి తన జేబులో ఉన్న 'నాకౌట్ పెప్పర్ స్ప్రే' డబ్బాను బయటకు తీసి తనపై దాడి చేస్తున్న ఎంపీలపై వదిలారు. కొందరు పక్కకు తప్పుకున్నారు. పొన్నం, గుత్తా, అరుణ్ యూసుఫ్ మాత్రం పట్టు వదల్లేదు. అప్పటికే కొంత వెసులుబాటు లభించడంతో లగడపాటి చెయ్యి పైకెత్తి కొద్దిసేపు గాలిలో స్ప్రే చేశారు. ఘాటు తీవ్రంగా ఉండటంతో ఒకటి, రెండు క్షణాల్లోనే అది స్పీకర్, హోం మంత్రి సహా అందరినీ ఆవరించింది. అందరూ దగ్గడం మొదలు పెట్టారు. లగడపాటికి సమీపంలోనే ఉన్న పొన్నం కళ్లలో నేరుగా స్ప్రే పడింది. ఆయన తీవ్ర ప్రభావానికి గురయ్యారు.

12.01 గంటలు..
అనూహ్య పరిణామంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. అంతలోనే... సబ్బం హరి హోం మంత్రి షిండే చేతుల్లో ఉన్న పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. షిండేకు రక్షణగా ఉన్న హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్‌తో సహా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సబ్బంను గట్టిగా పట్టుకుని ఆయనను వెనక్కు తీసుకెళ్లారు. ఏం జరుగుతోందో స్పీకర్‌కు అర్థం కాలేదు. అయోమయం మధ్యే ఆమె తన సీటు విడిచి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న ఒక అధికారి సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసినట్లు ప్రకటించారు.

12.02 గంటలు..
స్పీకర్ మీరాకుమార్, హోం మంత్రి షిండే బయటకు వెళ్లిపోయారు. సభలో ఉండొద్దని, స్ప్రే వల్ల హాని కలగొచ్చని, బయటకు వెళ్లిపోవాలని సుష్మా స్వరాజ్‌కు మార్షల్స్ సూచించడంతో ఆమె కూడా వెళ్లిపోయారు.

12.03 గంటలు..
లగడపాటిపై కాంగ్రెస్ ఎంపీలు తమ దాడి ఆపలేదు. కేంద్ర మంత్రి పళ్లంరాజు వచ్చి గుత్తా సుఖేందర్ రెడ్డిని పక్కకు తప్పించారు. లగడపాటి తేరుకునేలోపు టీడీపీ ఎంపీ రమేశ్ రాథోడ్ హఠాత్తుగా వచ్చి మళ్లీ దాడికి దిగారు. మిగిలిన కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలు కొందరు జరిగినదంతా చూస్తూ నిశ్చేష్ఠులైపోయారు. పురందేశ్వరి వెల్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా... కాంగ్రెస్ ఎంపీ రత్నాసింగ్ తదితరులు అడ్డుకున్నారు. 'ఎందుకు అడ్డుకుంటున్నారు?' అని పురందేశ్వరి ప్రశ్నించగా... 'మిమ్మల్ని కదలనివ్వొద్దని మాకు ఆదేశాలు జారీ చేశారు' అని వారు అడ్డుపడ్డారు.

12.04 గంటలు..
స్ప్రే ఘాటు సభ మొత్తం ఆవరించటంతో సభ్యులంతా బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది కోరారు. చాలామంది సభ్యులు, విలేకరులు కళ్ల నుంచి నీరు కారుతుండగా, ముక్కులకు గుడ్డలు కప్పుకుని, దగ్గుతూ బయటకు నడిచారు.

12.30 గంటలు..
అస్వస్థతకు గురైన ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను సహచర సభ్యులు కొందరు పార్లమెంటు భవనం నుంచి వెలుపలికి తీసుకొచ్చి, అంబులెన్స్‌లో ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. లగడపాటిని మార్షల్స్ అదుపులోకి తీసుకున్నారు. స్ప్రే ప్రభావంతో ఆయన కూడా అస్వస్థతకు గురయ్యారు. తొలుత లగడపాటిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాలని భావించినప్పటికీ... 'నేను బాగానే ఉన్నాను' అని చెప్పడంతో ఆయనకు మూడో అంతస్తులోని ఒక గదిలో పార్లమెంటు అనెక్స్‌లోని వైద్యులచేత ప్రథమ చికిత్స చేయించారు.

1.15 గంటలు..
"ఎంపీలను చంపేందుకు ప్రయత్నించారు. కఠిన చర్యలు తీసుకుంటాం. హత్యాయత్నం కేసు పెడతాం'' అని షిండే, కమల్‌నాథ్ ప్రకటించారు.

1.45 గంటలు..
విరిగిపోయిన మైక్‌ను సిబ్బంది సరిచేశారు. ల్యాప్‌టాప్‌ను యథాస్థానంలో ఉంచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్న ఇతర రాష్ట్రాల సభ్యులను కాంగ్రెస్ పెద్దలు, నేతలు అభినందించారు. సభలోకి వస్తున్న మోదుగుల, సబ్బం హరి తదితరులను భద్రతా సిబ్బంది అడ్డగించగా.. 'స్పీకర్ మమ్మల్ని సస్పెండ్ చేయకుండా మీరెలా అడ్డుకుంటారు?' అని మోదుగుల వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలంతా లోనికి వచ్చారు.

1.48 గంటలు..
కాంగ్రెస్ ఎంపీలంతా తిరిగి స్పీకర్ పోడియంకు అటువైపు, ఇటువైపు రక్షణగా నిలబడ్డారు. మోదుగుల, కొనకళ్ల నారాయణరావు పోడియం వద్దకు వెళుతుంటే వారు అడ్డుకున్నారు. 'ఏం జరుగుతోందో అంతా చూస్తున్నారు. ఇక్కడ ఇన్ని సీసీటీవీలు, కెమెరాలు ఉన్నాయి' అని కొనకళ్ల అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనకళ్ల, మోదుగులతో వాగ్వాదానికి దిగారు.

2.00 గంటలు..
స్పీకర్ మీరాకుమార్ సభలోకి వచ్చారు. 16 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి వారి పేర్లు చదువుతుండగానే... వెల్‌లోనే కొనకళ్ల నారాయణరావు గుండె పట్టుకుంటూ కుప్పకూలిపోయారు. మార్షల్స్ ఆయన్ను బయటకు తెచ్చి ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. స్పీకర్ సభ్యుల్ని సస్పెండ్ చేయగానే... అవిశ్వాస తీర్మానాలను చేపట్టారు. సభలో గందరగోళం ఉన్నందున వీటిని సభ దృష్టికి తీసుకురాలేకపోతున్నానంటూ ప్రభుత్వం, పార్లమెంటరీ పత్రాలను సభలో ప్రవేశపెట్టాలని ప్రకటించి, సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అయితే, సస్పెండ్ అయిన సీమాంధ్ర ఎంపీలు సభలోనే కూర్చున్నారు. కేంద్ర మంత్రులు సైతం వారితోపాటు సభలోనే ఉన్నారు.

3.00 గంటలు..
సీమాంధ్ర ఎంపీలు మళ్లీ పోడియం వద్దకు వస్తుండగానే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న సత్పాల్ మహరాజ్ ప్రకటించారు.

సాయంత్రం 5.00 గంటలు..
లగడపాటి పార్లమెంటు భవనం నుంచి బయటకు వచ్చారు. సబ్బంహరితో కలిసి తన ఇంటికి వెళ్లిపోయారు. అంతకుముందు ఆయనను ఉండవల్లి, కేవీపీ తదితరులు పరామర్శించారు.

'వాయిదా' ఎప్పటికి?
సభ వాయిదాపై స్పీకర్ మీరాకుమార్ కాస్త తడబడ్డారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత... స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే... ఈ సమయంలో 'సభ తిరిగి సోమవారం సమావేశమవుతుంది' అని తెలిపారు. అంతలోనే... మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమవుతుందని 'పొరపాటు'ను సరిదిద్దుకున్నారు. అంతలో... 3 గంటలకు సభ సమావేశమైనప్పుడు బిల్లును ఆమోదిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే, 3 గంటలకు ప్యానల్ స్పీకర్ మాత్రమే వచ్చి సభను సోమవారానికి వాయిదా వేశారు.

'అవిశ్వాసం' ఎప్పుడు?
యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానం గురువారం కూడా చేపట్టలేకపోయారు. అయితే... ఇందులో చిన్న 'మలుపు' ఉంది. గురువారం సీమాంధ్ర సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత స్పీకర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే... సస్పెండ్ అయినవారిలో అవిశ్వాసం నోటీసు ఇచ్చిన సభ్యులూ ఉన్నారు. దీంతో, అవిశ్వాసం నోటీసును పక్కన పెట్టాల్సి వచ్చింది. సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత, వారు ఇచ్చిన నోటీసును స్పీకర్ మీరాకుమార్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

అంతం కాదిది ఆరంభం!?

1940-50లలో మన తమిళ సోదరుల్లో ఒక సమరశీల వర్గం ప్రత్యేక ద్రవిడనాడు అంటూ ఒక సర్వసత్తాక స్వతంత్ర తమిళదేశ స్థాపన దిశగా ఏదో కొంత మోతాదులో ఉద్యమిస్తేనే దేశమంతా గగ్గోలు పెట్టేసింది. మనం తెలుగు వాళ్లం, అలాగే కన్నడిగులు వగైరాలు దానితో మాకేమీ సంబంధం లేదు, ద్రవిడకుటుంబం కావచ్చు కాని మేము మొదట భారతీయులం ఆ తర్వాతే తెలుగు వాళ్లం [కన్నడిగులం ] అని చెప్పుకుని తమిళుల్ని ఈసడించుకున్నాం. అలాగే శ్రీలంక తమిళ ఈలం ఉద్యమాన్ని కూడ తెలుగు వాళ్లు ఎప్పుడూ పెద్దగా సమర్థించలేదు అంటే ఆ కారణం చేతే. రాయప్రోలు సుబ్బారావుగారు ఆంధ్ర జాతి, భాషాభిమానాలగురించి గేయాలు రాసినా, ఆయన రాసిన ప్రముఖ గేయంలో మాత్రం తెలుగు ప్రసక్తే లేకుండా "పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం" అంటూ వున్నది ఒకే జాతి, అది హైందవ జాతి [భారత జాతి] అని మన తెలుగు జాతి అస్తిత్వాన్నికూడ తడమకుండా ఒక జాతీయ గీతంలా రాసాడు. భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న వారిలో మనం ఆంధ్రులం మొదటి పీటీలో వుండినా, ఆ విషయంలో మన ఆంధ్రోద్యమం దేశానికే గర్వకారణంగా, మహాత్మ గాంధీకి సైతం ప్రేరణగా వుండినా, మనం తెలుగు వాళ్లం ఎప్పుడూ ఒక స్వతంత్ర జాతి అస్తిత్వంకోసం డిమాండు చేయలేదు. అంతగా భారత జాతీయోద్యమంలో లీనమై అపార సేవలు అందించాము. ఆ మాటకొస్తే భారత దేశం రాజకీయంగా ఐక్యమై, భారత జాతిగా ఒక అస్తిత్వం కలిగివున్న కాలాలు చరిత్రలో బహు తక్కువే. బ్రిటిషు సామ్రాజ్యవాదుల పాపమో, పుణ్యమో ఆ ఫలంగానే నేటి ఐక్య భారత అస్తిత్వం రూపుదిద్దుకున్నదనేది తిరుగులేని వాస్తవం. దీనితో పోలిస్తే మన తెలుగు జాతి ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వంగా వుండిన కాలాలు చరిత్రలో ఇంకా ఎక్కువేనని చెప్పుకోవాలి. అయినప్పటికీ మనం మన తెలుగు జాతి అస్తిత్వాన్ని, వుద్యమాల్ని విశాలతర జాతీయోద్యమంలో పూర్తిగా లీనం చేసుకున్నాము. మనకు కొద్దిపాటి లౌక్యంవున్నా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని 1928లోనో, కాకున్నా 1937 లోనో తప్పకుండా సాధించివుండగలిగే వాళ్లమే. అలాంటప్పుడు మదరాసు నగరం మొత్తం గానీ, అందులో ముఖ్యమైన ఉత్తర భాగంగానీ మనకు తప్పక దక్కివుండేదే; బళ్లారి మొత్తంగా, హంపి, హోస్పేటలతో యుక్తంగా మనకు తప్పక దక్కివుండేది; అలాగే బరంపురంకూడా. కానీ అప్పుడుకూడ మన నాయకులు మొత్తం దేశంలో భాషాప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే కోరారు గాని, మన జాతిస్వార్థం ఒక్కటే చూచుకోలేదు. అందుకే 1936-37 ప్రాంతాల్లో ఒరిస్సా ఏర్పడినా, 1937 లో మదరాసు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానం చేసినా అప్పట్లోనే మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేక పోయాము. మన పోరాట శీలతకు, త్యాగాలకు గాంధీ ముగ్ధుడైనా, నెహ్రూ, పటేల్ లు మాత్రం స్వాతంత్ర్యానంతరం అడుగడుగునా అడ్డు తగులుతూ, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని జటిలం చేసారు. చివరకు ఎన్నో త్యాగాలతో, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి అమరత్వంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. మళ్లీ విశాలాంధ్ర నిర్మాణానికి సైతం నెహ్రూ ఎన్నో అడ్డుకట్టలు వేసినా, చివరకు మనం పోరాడి సాధించుకున్నాం. మనం అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల ప్రజలు ఉభయులూ - ప్రధానంగా తెలంగాణాలోనే విశాలాంధ్ర వుద్యమం ఉధృతంగా సాగింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాతకూడ మనం ఎప్పుడూ విశాలతర భారత జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాము.

కాని కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మనల్ని చిన్న చూపు చూస్తూనే వస్తూండినాయి. వాడుకుని పారవేసే [use and throw] వస్తువులుగానే చూస్తూ వచ్చాయి. NTR నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం, ఏర్పడ్డ 9 నెలలకాలంలో దాని ఘన విజయం కేవలం కాంగ్రెస్ దుష్పరిపాలనకు ప్రతిక్రియే కాక, తెలుగు జాతి అస్తిత్వ ప్రకటన, ఆత్మగౌరవ ప్రకటనగాకూడ జరిగింది. కాని మన జాతి ఐక్యత, చైతన్యాలను నప్పని కేంద్ర ప్రభుత్వాలు, మరి కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ ప్రాంతీయతత్వాల విజృంభనకు కుట్రలు చేసారు; దోహదం చేసారు. ఉన్న విభేదాల్ని మరింతగా పెంచడానికి, సామరస్యానికి బదులు సంఘర్షణను నెలకొల్పడానికే కృషి చేసిన ఫలితమే నేటి ఈ దుస్థితి. కష్టపడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలుగు సమైక్య రాష్ట్రం కూలిపోతున్నది. ఒకప్పుడు ఐక్యతకోసం పెద్దయెత్తున వుద్యమించిన తెలంగాణా ప్రజల్లోనే ఎక్కువమందిలో ప్రాంతీయోన్మాదం నింపి తెలుగు జాతిని చీల్చివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాకు late డాక్టరు మిత్రాగారు [అకూపంక్చరిస్ట్, భారత చైనా మిత్ర మండలి అధ్యక్షుడిగా వుండిన సాంఘిక కార్యకర్త ] గుర్తుకొస్తున్నారు. ఆయన 1990లలో స్వతంత్ర తెలుగు దేశ సాధనా సమితి లేక సంఘటన అని ఒకటి పెట్టి కొంతకాలం ఆ దిశగా కృషి చేసినట్లు గుర్తు. ఆయన కాళోజీగారితో తగువు పెట్టుకునే వాడు - మీరు ప్రత్యేక తెలంగాణా అంటున్నారు, నేను ప్రత్యేక స్వతంత్ర తెలుగు దేశం అంటున్నాను, అందులో తెలంగాణా ఒక రాష్ట్రంగా వుండొచ్చు గదా అని వాదిస్తూండే వాడు కూడ. సరే అది పుబ్బలో పుట్టి మఖలో మాడిన చందంగా జరిగిన ఒక చిన్న పరిణామమే. కాని కొన్ని ముఖ్యమైన రాజకీయ సూచనల్ని మిగిల్చి వెళ్లిన పరిణామం.

ఈ రోజు [లేక నిన్న అనాల్నేమో - 13-2-2014] సాయంత్రం TV 9 లో చర్చ సందర్భంగా ఒక తెలుగు దేశం నాయకుడు ఆవేశంలో చేసిన హెచ్చరిక, నలమోతు చక్రవర్తి విశాలాంధ్ర మహాసభ బ్లాగులో సూచనాత్మకంగా చేసిన హెచ్చరిక చూస్తే ఇదంతా గుర్తుకొచ్చింది. ఆ తెలుగు దేశం నేత చాల ఆవేశంగా ' శిక్కుల్ని అన్యాయం చేసినందుకు ఇందిరా గాంధీకి, తమిళుల్ని అన్యాయం చేసినందుకు రాజీవ్ గాంధీకి ఏమి దుర్గతి పట్టిందో అదే పరాభవం ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న సోనియా గాంధీకి కూడ పట్టక తప్పదు ' అని హెచ్చరించాడు. అలాగే నలమోతు చక్రవర్తి [తెలంగాణావాసియైన తెలుగు జాతి ఐక్యతా వాది] కూడ తెలుగు జాతి స్వతంత్ర అస్తిత్వ తపన ఇకపై మరింత బలపడితే తప్పు కేంద్ర ప్రభుత్వానిదేనని నర్మగర్భంగా హెచ్చరించాడు. మరి ఇదంతా చూస్తే ఇకపై కనీసం సీమాంధ్ర ప్రాంతంలోనైనా తెలుగు జాతి స్వతంత్ర అస్తిత్వ వాదం బాగా బలపడుతుందేమో, ఇదివరలో భారత ఐక్యతకు ఎంతో దోహదం చేసిన అస్సాం వాసులు నేడు గణనీయంగా స్వతంత్ర రాజ్య సాధనా వుద్యమానికి ఎందుకు మద్దతిస్తున్నారో, ఈశాన్య రాష్ట్రాల్లో స్వతంత్ర రాజ్య స్థాపనా వుద్యమాలు ఎందుకు చెలరేగుతున్నాయో, అలాగే నేటి ఈ సోనియా గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాల దుశ్చర్యలవల్ల తెలుగు సీమలోనూ, అలాగే మెల్ల మెల్లగా అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కూడ స్వతంత్ర జాతీయ రాజ్య సాధనా వుద్యమాలు పాదుకుని పోయి, విజృంభిస్తాయేమో, ఆవిధంగా నేటి రాష్ట్ర విభజనా దుశ్చర్య రేపు రేపు దేశమంతా ముక్కలు చెక్కలు కావడానికి దారి తీస్తుందేమో ననే భయాందోళనలు నాకు సహజంగానే కలుగుతున్నాయి కూడ. అయితే దీనికంతటికీ ముఖ్య కారణం దేశంలో సమాఖ్యా వ్యవస్థ, సమాఖ్యా స్ఫూర్తుల్ని తమ నీచ కుటిల స్వార్థ ప్రయోజనాలకోసం కుంగదీస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ముష్కరులది అని మాత్రం చెప్పకతప్పదు. అలాగే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పేరిట కేంద్ర ప్రభుత్వ నిరంకుశ అధికారాల పెంపు దిశగా కృషి చేస్తూ, ముఖ్యంగా తెలుగు జాతిని చీల్చడానికి ఒక ముఖ్య భూమిక వహించిన భారతీయ జనతా పార్టీకూడ ఈ పాపంలో కొంత మూటకట్టుకోక తప్పదు.

మన్మోహన్ ని చూసి చెప్పవచ్చు

రాష్ట్ర విభజన లాంటి కీలక సమస్య గురించి జాతిని గురించి అడ్రస్ చెయ్యలేని ఈ ప్రధాన మంత్రి కూడా ఒక ప్రధాన మంత్రే, అసమర్ధ నాయక గణం కీలక పదవులని అలంకరిస్తే ఎటువంటి అనర్ధాలో మన్మోహన్ ని చూసి చెప్పవచ్చు, రాష్ట్ర విభజన అనేది కోట్లాది మంది ప్రజల జీవితాలని మార్చే నిర్ణయం, ఇంతటి కీలక నిర్ణయాన్ని హడావుడిగా సీమాంధ్రుల మనోభావాలకి వ్యతిరేఖంగా తీసుకోవడం అన్యాయం, కనీసం సీమాంధ్రు లని మానసికంగా సిద్ధ పడనివ్వండి, దానికి కావాల్సింది టైం, 2009 ఎన్నికలలో తెరాస ఓడిపోయింది, ఓడిపోయిన వాదానికి రాష్ట్రం ఇవ్వడం అన్యాయం, కనీసం ఎన్నికలు అయిపోయిన తరువాత 2015 లో విభజించండి, అదే ప్రజాస్వామ్యం అంటే.

- ఫ్లిఫ్ సైడ్ ఇంకో విషయం ఏమిటంటే పదేళ్ళు పాలించిన పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తాముకాబట్టి వోట్లు వేయండి అని ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రతి పక్షం కూడా అభివృద్ధి ఎజెండా కాకుండా విభజన ఎజెండా మీద ఎన్నికలకి వెళ్ళడం మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి నిదర్శనం, ఇలా అయితే దేశం ఎలా ముందుకు వెళ్తుంది చెప్పండి, ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందుకు వెళ్ళాయి, మనం మాత్రం ఇలాంటి భావోద్వేగాలతో కొట్టుకుంటూ దేశాన్ని సక్సెస్ఫుల్ గా సంకనాకించేసాము.

Wednesday, February 12, 2014

కన్నీళ్లు పెట్టుకున్న గాదె !

సమైక్యవాదిగా పేరు పడ్డ సీనియర్ కాంగ్రెస్ నేత, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకట్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర బావోద్వేగానికి గురవుతున్నారు. తన సుధీర్ఘ రాజకీయ gade venkat reddyచరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని, అసలు తెలంగాణ బిల్లు ఇంతదాకా వస్తుందని అనుకోలేదని ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. అసెంబ్లీ వ్యతిరేకిస్తుందని తీర్మానం చేసిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలని చూడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.

తెలంగాణ వంటి నిర్ణయాన్ని అమలు చేయడం అంటే కష్టాలు కొనితెచ్చుకోవడమేనని, తెలంగాణ కోరుతున్నవారు తక్కువ అని, ఎన్ని కమిటీలు, నివేదికలు వచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పాయని, వాటన్నింటిని తుంగలో తొక్కి విభజనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని గాదె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి సమైక్యవాదిగా పేరు పడ్డ ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వదనే అనుకున్నారు.

భద్రతాదళాల వలయంలో పార్లమెంటు!

పకడ్బందీ వ్యూహం అమలుకు అర్థ రాత్రి దాకా ఏర్పాట్లు!

రాష్ట్ర విచ్చిత్తి బిల్లును ఆరునూరైనా పార్లమెంటులో పెట్టాలని మంకుపట్టుతో ఉన్న సోనియా ఒక శత్రు సమాజంపై యుద్ధ తయారీ చేస్తున్న రీతిలో వ్యవహరిస్తోంది! అడ్డగోలుగా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఆన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులనూ తోసిరాజనే విధంగా బిల్లును గెలిపించుకొవాలని నానారకాల కుయుక్తులతో అణచివేతకు, దమనకాండకు దారుణమైన ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటును అష్ట దిగ్బంధనం చేస్తోంది!

సమైక్య వాద ఎంపీలు, మంత్రులు తన నిరంకుశత్వాన్ని ధిక్కరించడాన్ని, తిరుగు బాటు చేయడాన్ని ఏమాత్రం సహించలేక పోతోంది! ఉక్రోషంతో రెచ్చి పోతోంది! రేపేదైనా మహోపద్రవం జరగబోతోందా అన్నట్లుగా అగ్నిమాపక దళాలు, అనేక పటాలాల మార్షల్స్, అంబులెన్సులు, డాగ్ స్క్వాడ్స్, చివరికి పాములు పట్టే వాళ్ళను కూడా సిద్ధం చేసి ఉంచినట్లు తెలుస్తోంది! తాళ్ళు, దుప్పట్లు, నిచ్చెనలు, ఇంకా నానారకాల సరంజామా సిద్ధం చేసారట! తీవ్రవాదులెవరో పార్లమెంటుపై ముట్టడి చేస్తున్నారా అన్నట్లుగా పారా హుషార్ ప్రకటించారు! ఈ దేశం తన సామ్రాజ్యమని, పార్లమెంటు ఆమె రాణీవాసం అనీ ఆమె తలపోస్తున్నట్లున్నది!

ఎందుకీ యుద్ధ తయారీ! ఎవరిపై ఈ కక్ష! ఎవరికీ ఎవరు శత్రువులు! ఎందుకింత దుర్భేద్యమైన అసాధారణ ఏర్పాట్లు? తెలుగు సమాజంపై సోనియా చూపిస్తున్న ఈ దారుణ వివక్ష కోట్లాది ప్రజల గుండెలను శూలాలతో పొడిచినట్లుగానే ఉంది! అందలాలెక్కించిన వారినే క్రూరమైన విద్వేషంతో కుళ్ళబొడిచేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ దుస్సాహసానికి ఆమె ఎందుకు ఒడిగడుతోంది?! దేశం కానీ దేశం నుంచి వచ్చినా - పెద్ద మనసుతో ఆదరించి పదవినిచ్చి అధికారంలో కూర్చోపెట్టిన వారిపైనే ఇంత అహంకారపూరితమైన అధికార మదోన్మాదంతో ఎందుకు విరుచుకు పడుతోంది?

రాష్ట్ర విచ్చిత్తి బిల్లుకు రాజ్యాంగ బద్ధత లేదు! దానికి యావత్తూ ప్రజల మద్దతు లేదు! ఆ బిల్లులో అనేక రాజ్యాంగపరమైన లొసుగులు, లోపాలూ ఉన్నాయి! అది ఏకపక్షమైన వివక్షా భరితమైన అన్యాయపు బిల్లు! అందరి ప్రజల ఆలోచనలను పంచుకోని బిల్లు! ఈ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు! అయినా దానిని ఎందుకామె పాశవిక పద్ధతులలో బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తోంది! అందుకోసం రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా మార్చేసి, చట్టాలను చాపచుట్టి అటకెక్కించి తన ఇష్టా రాజ్యంగా ఈ వికృత బిల్లును చెల్లుబాటు చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తోంది?

ఇట్లాంటి భయంకరమైన, కుట్ర పూరితమైన దురాగతాలకు పాల్పడిన వాళ్ళకు చివరకు ఏ గతి పడుతుందో చరిత్ర చెబుతోంది! దేశ సరిహద్దులను కాపాడటంలో లేని ఉత్సుకత, అవినీతిపరులను అడ్డుకోవడంలో చూపని ఉత్సాహం, ధరలను అదుపులో పెట్టడంలో కనిపించని నిబద్ధత - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు నుక్కలు చెయ్యడానికి ఎందుకు ప్రదర్శిస్తోంది?

పౌరుషం, ఆత్మాభిమానం ఉన్న ఏ జాతి అయినా ఈ పరమ దారుణ విభజన కాండను ఎదురించి తీరుతుంది! తెలుగు సమాజం అక్కర లేదని తీర్మానిస్తే - ఇది నా రాజ్యం - నా ఇష్టం అన్నట్లుగా - నడుస్తున్న ఈ విపరీత వ్యవహారాన్ని - అన్నివిధాలా ఎదిరించి తీరాలి!

ఇదే అంశంపై పార్లమెంటులో పోరాడుతున్న యోధులకు, వీధి వీధినా ఉద్యమాలు చేబట్టిన ప్రజావళికి, సమాచార, ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఉత్సాహం, ఆవేశం నింపుతున్న యువ నేతలకు అభినందనలు! పోరాటం మరింత ఉధృతం చేద్దాం! రాష్ట్రాన్ని సమైక్యంగా నిలుపుకుందాం!! -

కావ్వురి గారికి ఈ రోజు రాష్ట్రం తగలబడుతుంది అని గుర్తువచ్చింది

ఎవరికీ ఏప్పుడు జ్ఞానోదయం ఏ చెట్టు నీడ జరుగుతుందో
తెలియదు అంటే ఇదేనేమో .....మన కావ్వురి గారికి ఈ రోజు రాష్ట్రం తగలబడుతుంది అని గుర్తువచ్చింది .... ఎంత విచిత్రం ??

66 రోజుల ఉద్యమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలు అర్ధం కాలేదు ,రాజీనామా అడిగితే అటు తిరిగి చూడలేదు కారణం అయ్యనకు అప్పుడు జ్ఞానోదయం జరగలేదు తెలుసా సమైఖ్యవాదులారా...

ఎంత జ్ఞానోదయం కలిగిందంటే " ఈ ప్రాంతీయ వాదం దేశం విచ్చినం పునాది అంటా" మరి ఇదే కదా ఇన్ని రోజులు సమైఖ్యవాదులు చెప్పిన వినిపించుకోని సీమాంధ్ర కాబినెట్ మినిస్టర్ లు , ఎం.పి లు ఈ రోజు అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఢిల్లీ గల్లి లో తెలుగు ప్రజల పరువు తీస్తున్నారు ....

ఇదే మాట సమైఖ్యవాదులు 'తెలంగాణా వద్దు' అని చెప్తే మేము దేశం నుండి విడిపోతున్నమా?? అని రివర్స్ ప్రశ్నలు సందించారు వేర్పాటువాదులు ...

ఇటువంటి సమాధానమే మనం దేశ ప్రధమ పౌరుడు అయిన రాష్ట్రపతి గారు సమైఖ్య వాదులకి గీతోపదేశం చెయ్య చూసారు ..

"రాష్ట్రపతి రాజ్యాంగం అనుగుణంగా నడవాలి కాని , ఒక ఫోన్ కాల్ తో అయిన ... ఏదో IAS ఎక్షమ్ లాగా నైట్ అవుట్ చేసి ...ఈ నైట్ కి నైట్ అవుట్ చేసేరా... అన్నటుగా రాత్రికి రాత్రికి 69 పేజెస్ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్ పైన సంతకం చేసారు

సరే అయిన విచక్షణ వదిలేదం అనుకుంటే ... అంత క ముందు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో గౌరవనీయులైన ప్రణబ్ దాదా వచ్చినప్పుడు అయిన అంటారు .

" 1947 లోనే విభజన కోరేవారినే ఆపలేక పోయాము , ఈ 2014 లో ప్రజలని వారి కోరికలని ఎలా ఆప గలము???? అని దేశ ప్రజలకి ప్రశ్న వేసారు ...

కాని రాష్ట్రపతి గారు 1947 లో విభజన తో తెలంగాణా విభజన ని పోల్చి చూసి మనం ఆప లేము అనుకోని , BJP "ఒక vote రెండు రాష్ట్ర ల సిద్ధాంతం" చూసి అదే సరైన దారి భావించారేమో ???

కాని 1947 లో విభాజించినవారు మన వారు కాదు , విభజన కోరిన "జిన్నా" ప్రజల చేత ఎన్నుకోబడ్డ పరిపూర్ణ నాయకుడు కానే కాదు .... ఆ సమయం లో ప్రణబ్ దాదా మీకు "దేశ విభజన" మీకు గుర్తుకు వచ్చే బదులు మీకు ఆ టైం 'బెంగాల్ విభజన' చేసినప్పుడు "వందేమాతరం ఉద్యమం" ఎందుకు గుర్తుకు రాలేదు అని ఒక ప్రశ్న తోలచివేస్తుంది

కాని ఈ రోజు ఈ దేశం మీది, మీరే రాజు , మీ చేతిలో ప్రజలు ,ప్రజాస్వామ్యం అనే " మైనం ముద్దా" వుంది మీరు ఆ మైనం ముద్దని శిల్పం చేసిన , రాయిలాగా వదిలేసినా సర్వం మీదే బాధ్యత అని మర్చిపోయారా???

ప్రణబ్ దాదా మేరు కాంగ్రెస్ పార్టీ పెద్ద "troubleshooter " పేరు గాంచారు మరి 'దేశ సమగ్రత' విషయంలో ఎందుకు ఇలా తడబడ్దరో అర్ధం కావటం లేదు.

రేపు వచ్చే పరిణామాలలో ఎవరు వారి కోరిక కరెక్ట్ అనుకుంటూ పోతే దేశ సమగ్రతని మీరు ఎలా కాపాడబోతున్నారు దాదా ???

ఎందుకంటే ప్రాంతీయ వాదం అనేది ఒక ప్రాంత సమస్య కాదు అది "సామజిక అవ్యవస్థికరణ" వంటిది .
దానిని ఆపగలిగే మార్గం ఒకటే " జాతీయవాదం -పెంపొందించడం" అని మార్చిన నాడు ప్రజాస్వామ్యం పైన నమకం సడలుతుంది
జై సమైఖ్యాంధ్ర జై జై సమైఖ్యాంధ్ర

హింసను ఏ విధంగానూ తృప్తిపరచ లేము! దానితో రాజీ పడితే అది మరింత ముదురుతుంది!

విద్వేషం వెన్నంటే హింస ఉంటుంది. హింస జరిగే పరిస్థితి ఉన్నప్పుడు - విభజన అనంతరం కూడా అది బయట పడుతుంది. 
హింసను ఏ విధంగానూ తృప్తిపరచ లేము! దానితో రాజీ పడితే అది మరింత ముదురుతుంది! 
దేశ విభజన జరగకపోతే హింసను నిరోధించలేమని నాటి నేతలు భావించారు. కానీ - విభజన అనతరం ఎంతటి హింస జరిగిందో, నేటికీ అది ఎలా కొనసాగుతోందో మనం చూస్తున్నాం. మనం - మూలాలకే వెళ్ళాలి! విభజన జరగకపోతే - విరుచుకు పడుతుందని ఊహిస్తున్న హింసకు - వేళ్ళు విద్వేషంలో, విష ప్రచారంలో ఉన్నాయి. తీవ్రవాద సిద్ధాంతాలలో ఉన్నాయి! అట్లాంటప్పుడు - అనేక కష్ట నష్టాలతో కూడిన విభజన కూడా ఒక హింసాపూర్ణ నిర్ణయమే అవుతుంది! రాష్ట్ర విచ్చిన్నం తరతరాల సామాజిక అశాంతికే దారి తీస్తుంది!

ఈ రోజు తెలంగాణా బిల్ పై కాంగ్రెస్ పార్లిమెంట్ లో ప్రవేశ పెట్టటానికి కారణం ఏ కెసిఆర్ కాదు , కాంగ్రెస్ ఇచ్చినా వాగ్దానం కాదు కేవలం అంటే కేవలం సీమాంధ్ర మంత్రుల తమ ప్రాంత ప్రజల పట్ల వున్నా నీచ భావనే ...
తెలంగాణా కోరేవారు నాయకులని మోసం చేస్తారా అని ఢిల్లీ లో కూడా "జె .పిగారికి" రక్షణ లేదు అని తెలంగాణా వారు నిరూపిస్తే , తన భావన వ్యక్త పరుస్తుంటే నడిరోడ్ లో నిలదీసి తన్న తుంటే

సీమాంధ్ర లో ని ప్రజానికాని మాత్రం అటువంటి ప్రజా ప్రతినిధులు రోడ్ పైన ప్రజలని తన్నిస్తున్నారు.
ఒక రోజు బంద్ లోపాలుగోనాలని A.P.N.G.O వారు కోరితే ఇదే హర్ష కుమార్ తనయులు చేసిన నిర్వాకం గుర్తుంచుకోండి

సమైఖ్య వాదులారా ఇదే మన ఉద్యమం లో ఇతరుల ఉద్యమం లో వున్నా తేడ ని కూడా ఈ నాయకులూ గమనించటం లేదు
..ఇంత తేడ నాయకులలో ఎందుకు వచ్చింది ???

కారణం సీమాంధ్ర ప్రజల పట్ల కనీస బాధ్యత , కనీస వారి గోషా వినాలని కూడా లేదు ఈ సీమాంధ్ర మంత్రులకి ... తమ భవిషత్తు పైన , కాంగ్రెస్ పార్టీ పైన వున్నా మమకారం ప్రజల పైన లేదు అనేది అర్ధం అవుతుంది.

- " పురందేశ్వరి" ఊరు మారిన వోటు వేశాము, గెలిపించాం,

-రాజకీయాలలో కనీస అవగాహనా లేని సొంత పార్టీ నే మోసం చేసిన "చీరంజీవి కి" నెల్లూరు కట్టబెట్టము,

-టి -బిల్ వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటే "లగడపాటిని" నమ్మము,

-"శాంభశివ రావు" తన కొడుకు భవిషత్తు పునాదులు వేసుకుంటుంటే కూడా రాజీనామా ఇవ్వకుంటే నమ్మాము ,

-"ఉండవల్లి " ఇక్క రాజకీయ పోటి నుండి తప్పుకుంటాడు అందుకే అవసరమైన రోజు రాజీనామా చేయకుంటే ఒప్పుకున్నాము

-"హరిష కుమార్" కొడుకులు తంతే కూడా ప్రతి చేర్య కోరలేదు

మరి ఎలా వుంటుంది ప్రజల భయం వీరికి ???????

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన 6 సీమాంధ్ర కాంగ్రెస్ M.P గొప్పతనం చెప్పినవారు , ఈ రోజు ప్రజల కోసం సస్పెండ్ అయ్యారట ఎంత మోసం ... ఈ రోజు సస్పెన్షన్ ప్రజల కోసం పోరాడితే విధించారట ...

కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ టికెట్ వారికి గొప్ప అయితే ప్రజల నమ్మి వేసిన ఓట్లు వీరికి లెక్క లేదు ...

**66 రోజుల దీక్షలో రాజీనామా చేయమని కోరితే , టి- బిల్ పార్లిమెంట్ లో వస్తే కదా , బిల్ అసెంబ్లీ కి వస్తే కదా ...అని లగడపాటి తన రాజకీయ సన్యాసం గురించి పదే -పదే చెప్పి ప్రజలని మోసం చేసారు

**వాళ్ళు ఎందుకు చెయ్యరు మన ఏప్పుడైన ఎవరికీ వోటేస్తున్నం ??వారు వారి పార్టీ ఎజెండా ఏంటి అని అరా తీసే టైం వుంటే కదా ఎవరి భవిషత్తు వారు చూసుకోవడం లో బిజీ ఎంత అంటే ఈ రోజు కొంప తగలబెట్టే వారు రేపు మళ్ళి ముసుగు మార్చుకొని వస్తే క్షేమించేసి మళ్ళి వోట్ వేసేస్తాము కదా

మనకి మోసపోవటం అలవాటే , వాళ్ళకి మోసం చేయటం అలవాటే కాని
**ఈ "విభజన బిల్" సీమాంధ్ర ప్రజలు ఉహించని పరిణామం ...
కాని అవసరానికి ప్రజా ప్రతినిధులు తలపు తడితే ... కోటి తన్ని పంపుతున్నారు ...

**అవసరానికి ఆదుకొని .. "ఆ దేవుడైన విడనాడాలనేది" నానుడి కాని ఈ ప్రజలలో మార్పు వచ్చే వారికే ఈ నాటకం ...
మార్పు ప్రజల లో వస్తే .. ప్రభంజనం..దానికి ఎంతో దూరం లేదు

జై సమైఖ్యాంధ్ర జై జై సమైఖ్యాంధ్ర . -RSR-