Friday, November 11, 2016

కార్తీకమాసం-వివిధ దానాలు

కార్తీక మాసంలో ఏ దానముచేసిన అత్యంత పుణ్యఫలం. దానాల్లో దీప దానం, స్వయం పాకం, శాఖా దానం, ధన దానం, వస్త్ర దానం, సువర్ణ దానం ప్రధానమైనవి.
శాఖా దానం అంటే-- బ్రాహ్మణునికి కూరగాయలు దానం ఇవ్వాలి. ఉసిరి, తులసి కూడా దానమిచ్చి గ్రహీత అశ్విర్వాదని పొందాలి. దంపతులను పార్వతి పరమేశ్వరాలుగా భావించి బోజనాదులు (ఆతిధ్యం) ఇవ్వాలి. ఆ విధమైన శక్తి, వెసులుబాటు లేనివారు యజ్ఞోపవీతం, తాంబూలం, దక్షిణలిచ్చి 'శాఖా దానం' విధిని నిర్వర్థించమన్న సంతృప్తి పొందగలరు.
శయన దానం అంటే-- పరుపు, మంచం, దుప్పటి దానంగా ఇవ్వాలి. ఈ దాన ఫలితం స్వర్గప్రాప్తి
కన్య దానం పాలం కూడా ఉత్తమమైనది. అందుకనే మన తెలుగువారు పెళ్లిళ్లు అధికంగా కార్తీక మాసంలోనే జరుగుతాయి.
గోదానం, అన్నదానం పుణ్యప్రదమైనది.

జన్మలు మూడు రకాలు.


1) దేవ జన్మ
2) మానవ జన్మ
౩) జంతు జన్మ.
అన్ని జన్మలలో మానవ జన్మ చాల దుర్లభమైనది మరియు మహోన్నతమైనది అదేలాగు చాల ఉత్తమోత్తమమైనది.
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారము లేదు. అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు.తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని (మనవలోకాన్ని) చేరుకోవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులు ఉంటాయి కాని స్థూల శరీరం వుండదు. కనుక భగవత్సాక్షారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.
ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కన్పించిన, ఆ కర్మలన్ని బుద్దిపరంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే పరతంత్రంగా చేస్తాయి.కారణం ఈ జంతు జన్మలలో శరీరం మరియు మనస్సు వున్నాయి కాని బుద్ది మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడ కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భాగవత్సాక్షారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.
ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు , బాధలు, అవమానాలు అనుభవిస్తాడు.అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవ జన్మలోనే వున్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ది అనే సాదనం వున్న జన్మ ఇది. అదే విధంగా పరమాత్మ నందుకోవదడానికి తగిన కర్మలు చేసే అధికారం , జ్ఞానాన్ని పొందే అవకాశం వున్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానజన్మను “జంతూనాం నారా జన్మ దుర్లభం” అని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి.
సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ? : ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తాత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).ఏమిటా ఆ నిత్య వస్తువు? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు? ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం). “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకొనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే, జన్మను సార్థకం చేసుకోవటమంటే. ఆ శాశ్వతనందాన్నే మోక్షం, ముక్తి అన్నారు. అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి). బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ). ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే. వాటిని అన్నిటిని వదిలించుకోవాలంటే భగవంతార్పణ బుద్దితో కర్మలను చెయ్యాలి ఆచరించాలి

ప్రతి ఒక్క హిందువు ఈ 25 నిజాలు తప్పక తెల్సుకోవాలి.!!


1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన“హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం లో ఉందా ?
3) ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైన ముస్లిమేతరుడిని ప్రధానిగా , కాని అధ్యక్షుడిగా కాని కల్గి ఉందా ?
4) తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏ ముల్లా కాని మౌల్వి కాని “ ఫత్ఫా “ ను జారి చేసారా ?
5) హిందువులు మేజారిటిగా గా ఉన్న మహారాష్ట్ర, బీహార్, కేరళ,పాండిచేరి మొదలైన రాష్ట్రాలలో అనేక పర్యాయాలు ముస్లిం మతస్తుడు ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డారు, ముస్లింలు మేజారిటిగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో కాని,క్రైస్తవులు మేజరిటిగా ఉన్న నాగాలాండ్,మిజోరం లాంటి రాష్ట్రాలలో ఒక హిందువును ముఖ్యమంత్రి గా ఉహించుకోగలమా ?
6) దేశం లో ఉన్న 85% హిందువులు సెక్యులర్ కాక పొతే , మస్జిద్ లు, మదర్సా లు ఎలా మనగల్గుతున్నాయి ?, ముస్లింలు రోడ్లపై “నమాజ్” ఎలా చేయగల్గుతున్నారు ?, రోజుకు ఐదు సార్లు “అల్లాహ” తప్ప మరెవరు దేవుడు కాదని లౌడ్ స్పీకర్లు పెట్టి మరి ఎలా చెప్పగల్గుతున్నారు ?
7) ముస్లింల కోరిక మేరకు భారత్ లోని 30% భూభాగాన్ని హిందువులు వాడులుకున్నప్పుడు , అయోధ్య , మధుర, కాశీ లాంటి పుణ్య స్థలాల కోసం వారిని అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకేందుకు ?
8) హిందూ దేవాలయాల ఆదాయాన్ని మైనారిటీల సంక్షేమం కోసం ఖర్చుపెడ్తున్న ప్రభుత్వం , వారి ప్రార్థన స్థలాల ఆదాయాన్ని ముట్టె సాహసం చేయగలదా ?
9) భారత స్వసంత్ర ఉద్యమానికి ఏమాత్రం సంబందం లేని ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీజీ ఎందుకు మద్దతిచ్చారు ?
10) క్రైస్తవ, ముస్లిం పాఠశాలలో బైబిల్,ఖురాన్ బోదనలు నేరం కానప్పుడు భగవత్గీత బోదన తప్పేలా అవుతుంది ?
11) “హజ్ యాత్రకు సబ్సిడి ఇస్తున్న ప్రభుత్వం అమరనాథ్ , మాసన సరోవరంయాత్రలకు రెట్టింపు పన్నులు విదిస్తుంది , ఇదెక్కడి న్యాయం ?
12) కేరళ లో MLA,MP,మంత్రులు అల్లాహ , క్రీస్తు పేరుతొ ప్రమాణ స్వీకారం రాజ్యంగా విరుద్దం అయిన చేస్తున్నారు ఎందుకు ?
13) అస్సాం లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థిర సివాసం ఏర్పాటు చేసుకోవడానికిIMTD చట్టం ఉతమిచ్చింది , కాని భారతియులైనప్పటికి జమ్మూ కాశ్మీర్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు ! ఎందుకి ద్వంద నీతి ?
14) భారత దేశం లోని అన్ని రాస్త్రాలాగానే జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం అలాంటప్పుడు ప్రత్యెక స్వయం ప్రతిపత్తి ఎందుకు ?
15) పాఠశాల విద్యార్థులకు సైతం యునిఫం ఉండే మన దేశం లో దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఎందుకు సాద్యం కావడం లేదు ?
16) దీపావళి లాంటి పండుగులను వైట్ హౌస్ , బ్రిటన్ పార్లమెంట్ ఘనంగా జరుపుకుంటున్నాయి , అలాంటప్పుడు మన పార్లమెంట్ లో ఎందుకు జరుపుకోకూడదు ?
17) ఇస్లాం శాంతి కామక మతం అయితే , ఖురాన్ ను చదివి ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు ?
18) “ ఈశ్వర్ అల్లాహ తేరే నామ్ “ – దిన్ని ఒప్పుకునే ఒక ముస్లిం మౌల్విని చూపండి ?
19) దేశ జనాభాలో 10% కంటే తక్కువగా ఉన్నవారినే మైనరిటిలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సూచించింది , అలాంటప్పుడు 15% కంటే ఎక్కువగా ఉన్న ముస్లిం మైనరిటిలుగా ఎలా పరిగణించబడతారు ?
20) హిందు ఆధిక్య ప్రాంతం లో ఉన్న ముస్లిం కుటుంబాలు సుఖ శాంతులతో ఉంటున్నాయి, ముస్లిం ఆధిక్య ప్రాంతం లో హిందూ కుటుంబం శాంతిగా జివించగలదా ?
21) హిందూ మెజారిటి ఉన్న రాష్ట్రలు ప్రశాంతంగానే ఉంటున్నాయి , కాని జమ్మూ, నాగాలాండ్, మిజోరం ఎందుకలా లేవు ?
22) జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న పాకిస్తానీ జమ్మూ పౌరునిగా మారుతున్నాడు, కాని జమ్మూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భారతీయుడు జమ్మూ నివాసిగా మారడానికి అనర్హుడు ఇదెక్కడి న్యాయం ?
23) క్రైస్తావురాలిని పెళ్ళి చేసుకున్న J&K మాజీ ముఖ్యమంత్రి ఫారుఖ్ అబ్దుల్ల, హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న కుమారుడి వివాహాన్ని అంగీకరించి , హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కూతురి వివాహాన్ని అంగీకరించలేదు కారణం ?( ఇదే సేక్యులరిసం )
24) దురక్రమదారుడైన బాబర్ పేరుతొ అయోధ్యలో మస్జిద్ నిర్మాణం మీకు అంగీకారమ ?
25) హిందూ ఆధిక్యత గల ప్రాంతాల నుండి మొహర్రం యాత్ర సాఫీగా సాగుతుంది , ముస్లిం ఆధిక్యత గల ప్రాంతం నుండి వినాయక యాత్ర సాఫీగా సాగుతుందా ?

ఒక్క సారి ఆలోచించండి నా హిందూ సోదరులు …
జైశ్రీరాం ………..
భారత్ మాతా కీ జై ……

పెరియపురాణం

మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుదివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.
ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము యిచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును యివ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఇది మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదుమాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అని అంటాడు. . కామక్రోదాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.
ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.
‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.
నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.
నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.
నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోటి. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.
వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి
యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.

ఆది శంకరాచార్యులు


సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ.788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి.శంకరులు సాక్షాత్తు శివునిఅవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).
హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు,విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
జీవిత గాధ
శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచనచిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచనకేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.
జననము
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటిత్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి,సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అనిశంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
బాల్యము
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగాఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్నిచెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవిబంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.
ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
సన్యాస స్వీకారము
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
గోవింద భగవత్పాదుల దర్శనo
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగాబోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైనవారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్రగంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరునిసన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.
మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటినిఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడేఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకుభాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరినాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవించాడు.
శంకరాచార్యుల శిష్యులు
శంకరులకు అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
పద్మపాదుడు
పూర్తి వ్యాసం పద్మపాదాచార్యులు
శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడుపద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.
కుమారిల భట్టు ను కలవడం
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకువ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైనకుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
భట్టిపాదుడు
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగాశంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్క్తి ప్రసాదిస్తాడు
మండన మిశ్రునితో తర్క గోష్ఠి
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితోవ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు,జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీస్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది.బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగాడు.
కామరూపవిద్య
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.
దిగ్విజయ యాత్రలు
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుని శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
కేదారనాధ్‌లో శంకరుని సమాధి మందిరం వద్ద ప్రతిమ
శంకరుడు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్,బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోనిత్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. కాదు కంచిలో అని కూడా అంటారు.
శంకరుని జీవిత కాలము
శంకరుని జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.
క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.
అయితే శంకరుడు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుని సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దంవాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత పక్కాగా ఉండే అవకాశం ఉండవచ్చును.
చతుర్మఠాల వ్యవస్థ
శృంగేరిలో విద్యాశంకర మందిరం
(జగద్గురు బోధలు,సాధన గ్రంథ మండలివారి శంకరుల జీవిత చరిత్ర ల నుండి)
మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరుడు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించాడనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిర్మించాడో తెలుస్తుంది. చతుర్ధామాలునిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరుడుమఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టాడు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది.నేటి ఆధునిక పద్ధతులను శంకరుడు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగింది.
శంకరుడు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టాడు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరుడు నిర్దేశించాడు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురిఅనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరుడు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించాడు.
మఠాల వివరాలుశిష్యుడుమఠంమహావాక్యంవేదంసంప్రదాయం హస్తామలకాచార్యుడుగోవర్ధన పీఠం
పూరిప్రజ్ఞానం బ్రహ్మాఋగ్వేదంభోగవారసురేశ్వరాచార్యుడుశృంగేరి శారదాపీఠం
శృంగేరిఅహం బ్రహ్మాస్మియజుర్వేదంభూరివారపద్మపాదాచార్యుడుకాంచి పీఠం
ద్వారకతత్వమసిసామవేదంకీటవారతోటకాచాఱ్యుడుజ్యోతిర్మఠం
బదరీనాధ్అయమాత్మా బ్రహ్మాఅథర్వవేదంఆనందవార
ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించారు.
వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడింది.
ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మయజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మిసామవేదం నుండి తత్త్వమసిఅధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ
అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.
సంప్రదాయాలు: సంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరుడు నాలుగు మఠాలను నిర్దేశించాడు.
మఠ నిర్వహణలో శంకరుని వ్యవస్థానైపుణ్యము
మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరుడు ఏర్పరిచాడు. వాటిలో
శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు మరియు ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.
శంకరుని రచనలు
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు వేదములు (శ్రుతులు) ఋగ్వేదం · యజుర్వేదంసామవేదము · అధర్వణవేదమువేదభాగాలుసంహిత · బ్రాహ్మణముఅరణ్యకము · ఉపనిషత్తులుఉపనిషత్తులుఐతరేయ · బృహదారణ్యకఈశ · తైత్తిరీయ · ఛాందోగ్యకఠ · కేన · ముండకమాండూక్య ·ప్రశ్నశ్వేతాశ్వరవేదాంగములు (సూత్రములు)శిక్ష · ఛందస్సువ్యాకరణము · నిరుక్తముజ్యోతిషము · కల్పముస్మృతులుఇతిహాసములుమహాభారతము · రామాయణముపురాణములుధర్మశాస్త్రములుఆగమములుశైవ · వైఖానసము ·పాంచరాత్రముదర్శనములుసాంఖ్య · యోగవైశేషిక · న్యాయపూర్వమీమాంస · ఉత్తరమీమాంసఇతర గ్రంథాలుభగవద్గీత · భాగవతంవిష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలులలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలుశివ సహస్రనామ స్తోత్రముత్రిమూర్తులు · తిరుమల తిరుపతిపండుగలు · పుణ్యక్షేత్రాలు.
ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుని రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరుడు ఉదహరించాడు. స్వానుభవానికి శంకరుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అతని రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుని రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.
భాష్యాలు
వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరుడు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి

మన సాంప్రదాయలు


ముక్కులు కుట్టిన్చుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.
చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.
ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి , తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.
స్త్రీలకు బేసి సంఖ్యా గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.
సూర్య గ్రహణానికి ముందు ”12 ” గంటల కాలము, చంద్ర గ్రహణానికి ”9” గంటల ముందు కాలము కడుపు కాలిగా ఉంచుకోవలెను.
శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి మరియు పుట్టిన సమయమునకు సూర్యుడు ఎ రాశిలో ఉంటె అది వారి జన్మ లగ్నం.
జ్యోతిశాస్త్రం ప్రకారం బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి భుదునకు, ఇనుము శని కి ఇష్టము.
రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
బుదవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను వ్రేలాడ కట్టుకుంటే నరఘోశాలు తొలుగుతాయి.
యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండు నపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకొని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.
ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.
ఇద్దరు ఆడపిల్లలకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి.
గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకోట్టుచుండురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎత్తి పరిస్తుతులోను స్త్రీలు చేయరాదు.
వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.
తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.
బోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608-1693)17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటకరాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగు తున్నాయి
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటు, రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, ప్రుట్టు గుడ్డి వాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు.
జననo
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు, క్రీస్తు శకం 1608 లో జన్మించాడు . ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.
తల్లికి చేసిన జ్ఞానబోధ
బ్రహ్మంగారికి ఆదిశంకరులు వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి, దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.
అచ్చమాంబకు జ్ఞానబోధ
బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి, ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో, ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి, దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేత మేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం, పశువుల ప్రవర్తన గమనించి, ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవు అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటే" నని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా, ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేసాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.
ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.
అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది.
అచ్చమ్మ:- ఆయనను ఎలా తెలుసుకోగలం?
బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం.
అచ్చమ్మ:- ఆయన స్త్రీయా పురుషుడా?
బ్రహ్మంగారు:- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు వర్ణనకు అతీతుడు. ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు.
బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు. ఆయన రాగానే స్వయంగా స్వాగతంచెప్పి, ఆయనను ఆసీనులను చేసాడు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు. ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా, సేవకుడు అలాగే చేసాడు. ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి, ఆయనను పలువిధాల ప్రశంసించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తరువాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి, దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి, ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు.
విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి, ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
దేశాటన
ఆపై ఆయనకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. ఆసమయంలో కడప జిల్లాలో పర్యటిస్తూ కందిమల్లయ పాలెం చేరుకున్నాడు. ఆ ఊరు ఆయనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించారు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు ఆయనను కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు.వారు ఆయనను చులకనచేసి మాట్లాడగా ఆయన తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు.అందరి ముందు గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ' అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు ఆయనకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు.ఆయన వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు.ఇలా ఆయన గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు ఆయనకోసం తరలి రావడం మొదలుపెట్టారు.
కొంతకాలం తరువాత బ్రహ్మంగారి కందిమల్లయపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు.అలా పెద కామెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. ఆయన అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు.ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా ఆయనను శ్మశానానికి తీసుకు వెళుతున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి 'ఏమైందని' అని అడిగాడు.వారు 'అతడు మరణించాడు శ్మశానానికి తీసుకు వెళుతున్నాం ' అని బదులు చెప్పారు.కానీ బ్రహ్మంగారు 'ఇతడు మరణింలేదుకదా ఎందుకు తీసుకు వెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి' అని చెప్పి వారి వెంట వెళ్ళాడు.వారు ఆయనపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు.అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృసించగానే ఆయన జీవించాడు.అది చూసిన వారంతా ఆయనపట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు.
బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు ఆయనను ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు.బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా ఆయనవారికి బుద్ధిమతి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి ఆతనిని సజీవుని చేశారు.ఆతరువాత అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా కొలవసాగారు. ఊరి ప్రజల కోరికపై ఆయన వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు.
వివాహం
బ్రహ్మంగారి బోధలు విని పెదకొమర్లపల్లెలోని ప్రజలు ఆయన అనుచరులుగా మారారు.ఆ ఊరిలోని శివకోటాయ్య చార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తనకుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు.అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు.వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసాడు.
కొంత కాలం తరువాత ఆయన తిరిగి దేశాటనకు బయలుదేరాడు.ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్ లో పర్యటించి హైదరాబాదు చేరాడు.
హైదరాబాదు పర్యట
హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు.మొందుగా నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశసంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు.బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు.సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు.అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు.నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.
సిద్దయ్య
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు.ఆయన ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీయశిష్యుని చేసుకుని ఆయనకు అనేక ఉన్నత భోదలు చేసాడు.ఆయన జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.
బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు.ఆ తరువాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు.అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసాడు.
తిరుగు ప్రయాణo
బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు.శిష్యబృదంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు.ఆయన తన శిష్యుడైన వెంకటయ్యనుద్దేశించి 'కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది' అని యథాప్రకారం సంభాషించసాగారు. అక్కడికి కొంత దూరంలో ఏవోమాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోదిస్తూ కనపడింది. బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ 'మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాపవిముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు.వెంటనే అతనికి వ్యాధి మాయం అయింది. వారు ఆయనను కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞాన బోధ చేయమని కోరగా ఆయన తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపి వేసాడు.
బ్రహ్మంగారిపై ఆరోపణ
ఒకరోజు బ్రహ్మంగారికి కడపనవాబు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో పీరు సాహెబ్ తన కుమారుడైన సిద్దయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలు దేరగా సిద్దయ్య ఇది తనకు సంబంధించిన విషయంకనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు.
మార్గమధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకుని ఊరి బయట బసచేసాడు.అక్కడ ఆయన ధ్యానంచేస్తూ తనదగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకథారణ చేయిస్తూ వచ్చాడు.ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్దయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు.ఆదేశంపై వచ్చిన సిద్దయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి 'మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతన్ని అవమానించావు కనుక నీవు శిక్షార్హుడువి ఇందుకు నీ జవాబేమిటి 'అని గద్దించాడు.జవాబుగా సిద్దయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి 'నీకు మహిమలు తెలుసుకదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను 'అన్నాడు.జవాబుగా సిద్దయ్య 'గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని సరి పరిస్థితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండ రాయిని తెప్పించండి' అన్నాడు.సిద్దయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆబండను పెట్టించి గురువుగారిని తలచుకుని సలాం చేశాడు.వెంటనే ఆబండ ముక్కలైంది.నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్దయ్య అది తనపని కాదని తన గురువుగారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు.
బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుందలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు.కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు.ఇంట్లో అతని భార్య నింద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు.అయినా ఆమెశరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు.ఆయన మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని ఆయన దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనిభార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది.కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని ఆయనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు.బ్రహ్మంగారు ఎవరూ 'నన్ను పూజించవద్దు నాశిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము నువ్వు కూడా అదే పని చెయ్యి ' అని చెప్పి తిరిగి వెళ్ళాడు.
విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశo
బ్రహ్మంగారు యధావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపంలోని ఒకగ్రామంలో భోజనార్ధం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు.అతను పనిమీద నిమగ్నమై నీళ్ళు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకుని త్రాగమని చెప్పాడు.బ్రహ్మంగారు వినకుండా నీళ్ళు కావాలని తిరిగి అడిగాడు.విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు.బ్రహ్మంగారు మారు పలుకక ఆలోహ ద్రవాన్ని త్రాగి వేసాడు.అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధంచేశానని క్షమించమని వేడుకున్నాడు.అందుకు బ్రహ్మంగారు "నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరిమీద కోపం లేదు" అని చెప్పాడు.ఆతరువాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిధ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు.నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి బోజనవసతులు కల్పించి ధర్మ బోధవిని ఆనందించారు.నంద్యాలలో విశ్వబ్రాహ్మణులనుపంచాననం అనేవారు.బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్నిచ్చి క్షుద్భాధ తీర్చమని అడిగాడు.వారు ఆయనను ఎంత అన్నం అవసరమౌతుందని పరిహసించారు.బదులుగా బ్రహ్మంగారు "మాకు ఎంత అవసరములే మాకడుపు నిండినంత చాలు" అన్నారు.వారు బ్రహ్మంగారిని అవమానించాలని "అలాకాదు మీరు తక్కువ తింటే ఎలా ఒకపుట్టి బియ్యం వండి వడ్డిస్తాం మీరు అంతా తిని మమ్ములను సంతృప్తి పరచండి" అన్నారు.అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు.అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరంలేదని తనశిష్యుడు సిద్దయ్య చాలని అన్నాడు.బ్రహ్మంగారు ఒక్క ముద్ద అన్నం తీసుకుని మిగిలినదానిని తినమని సిద్దయ్యను ఆజ్ఞాపించాడు.సిద్దయ్య అలాగే ఆన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేసాడు.ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు.ఆయన చిరునవ్వుతో తనచేతిలోని అన్నాన్ని సిద్దయ్యకు అందించగా అది ఆరగించిన తరువాత అతని ఆకలి తీరింది.విశ్వబ్రాహ్మలు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు.ఆయన వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు.
సమాధి తర్వాత దర్శనం
సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు.బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడు. ఆ తరువాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించాడు.
బనగనుపల్లె చింతచెట్టు
బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.
బ్రహ్మంగారి మఠం
బ్రహ్మంగారి మఠం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రస్తుతం బి.మఠం మండల కేంద్రం కూడా.
బ్రహ్మం గారు కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశారు. ఈయన శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి, మరొక భక్తుడుమాదిగకక్కయ్య పంచముడు అవడమే ఇందుకు తార్కాణము. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసములో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు.
వారసులు
బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం) వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల (తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసి రావు గారి ఏర్పాటు) నడుస్తున్నాయి.
కాలజ్ఞానం పద్యాలు
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము (ముక్తి మార్గము భక్తి మార్గము పుస్తకములో) నుండి కొన్ని పద్యాలు)
వీరబ్రహ్మము యెక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!
వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆధి పురుషుని నమ్ము!
నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలోను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!
స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!
అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగ కాపాడుకొనియేరయ!
తమవెంట వచ్చేది మనస్సు బుద్దనుమాట
యోచింపకుండనే బ్రతికేరయ!
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!
బాహ్యా విషయములకై పరుగెత్తినావంటె
యేడ్పించి నీపై స్వారి జేసేను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటె
ప్రకృతే నీపాద సేవ జేసేను!
దైవ ధ్యానము కన్న మించినది లేదయ
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు, కఠిన రోగంబులకు
దివ్యౌషధంబని నమ్మండయ!
ఆత్మజ్ఞాన పద్యాలు
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మజ్ఞానము (ముక్తి మార్గము భక్తి మార్గము పుస్తకములో) నుండి కొన్ని పద్యాలు)
సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాసరూపములో హంసగా సంచరిస్తున్న ఓ కాళీ మాతా!
కాలికాంబా యనుట లీలా వినో దంబు
కాదు కాదు! హంస! కాళికాంబె
హంస కాళికాంబె! ఆత్మ కాళిక సుమా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| కాళికాంబ అనుట వల్ల ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది సకల జీవులందు శ్వాస రూపములో సంచరిస్తున్న ।హంస। గూడ ఒక ఆనందమైన అనుభూతిని
ఇచ్చేదే. ఆత్మశక్తి హంసరూపములో సంచరిస్తు ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆనందమైన అనుభూతియే ఆత్మ. ఆత్మశక్తియే కాళీమాతా.
తల్లిదండ్రీ గురువు దైవమ్ములందున
తల్లి పూజ్యముఖ్య మెల్లరకును
సృష్టి కంతటికిని స్త్రీ ప్రధానముగదా
కాళికాంబ! హంస కాళికాంబ
తా|| ఓ కాళీ మాతా! తల్లి తండ్రి, గురువు, దైవము, ఈ నాల్గింటియందు, సమస్త ప్రజలకు మొదటగా పూజింప దగినది తల్లి మాత్రమే. స్త్రీ ముఖ్యముగా సృష్టి అంతటికీ ప్రధానమై యున్నది.
గాలిరీతి విశ్వ గోళాలలో నుందు
దివుల భువుల మధ్య తిరుగగలవు
నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళి మాతా! గాలి రూపములో, విశ్వగోళాలలో ఉంటావు. భూమి ఆకాశముల మధ్య తిరుగుతుంటావు... నీవులేని చోటు అంటు కచ్చితముగా ఎక్కడలేదు.

నారదుడు: - వీణ సృష్టికర్త అయిన నారదుడు.

నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ,నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ,తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.
ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -
భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేద వ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వ గాధను వ్యాసునకు వివరిస్తాడు.రామాయణం, బాలకాండలో నారదుడు
వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.మహాభారతం సభా పర్వంలో నారదుడునారద పురాణమునారద భక్తి సూత్రాలు నారదోపనిషత్తు
నారదుని పూర్వ జన్మ వృత్తాంతం
మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాధను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.
పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు.
అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.
అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడ జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.
ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.
మహాభారతంలో వర్ణన
మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్తవ్య , అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.

అనసూయా దేవి పాతివ్రత్య మహిమ


సప్త మహర్షులలో అత్రి మహర్షి ఒకరు. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడని,అనసూయ అనగా అసూయలేనిది అని అర్ధం. అత్రి మహర్షి ఒకనాడు అనసూయా మాతను పరీక్షించదలచి ధ్యానానికి కూర్చుంటూ నీరు తెమ్మని కోరి, ధ్యానంలో తీవ్రమైన సమాధిస్థితిలోకి వెళ్లారు. భర్త యొక్క తపస్సును భంగపరచరాదని తలచి ఆమె అత్రి ముని సమాధిస్థితి నుండి బయటకు వచ్చే వరకు, అనగా పన్నెండు సంవత్సరములు అక్కడే వేచి ఉంది. పన్నెండు సంవత్సరముల తర్వాత ధ్యానస్థితి నుండి మేల్కొన్న అత్రి మహర్షి నీరు ఇవ్వడానికి సిద్ధంగా తన ఎదురుగా వేచి వున్న భార్య పతిభక్తికి సంతుష్టులయ్యారు.
పతిని సేవించడం ద్వారానే పాతివ్రత్యం గుర్తించబడుతుందనే విషయం ఇక్కడ గమనార్హం. అత్రి మహర్షుల వారు సాక్షాత్తు భగవంతుడే, కానీ సామాన్యులమైన మనం అలా కాదుగా. ఇక్కడ పతి అంటే భర్త యొక్క రూపాన్నిగాక, ఆయనలో వున్న భగవంతుడు అని అర్ధం చేసుకోవాలి. భర్త రూపంలో భగవంతుడ్ని సేవిస్తున్నాను అనుకునే స్త్రీ, సాధారణ భార్య స్థాయిని దాటి 'సాధకురాలవుతుంది', భావమే భక్తిలో ప్రధానం. "సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్నారు. అంటే ఏదైనా సాధించడానికి ఓ సాధనని ఏర్పాటుచేసుకొని నిరంతరం దాన్నే సాధన చేస్తూ పోతే ఈ భూమిలో సాధ్యంకానిది ఏమీ లేదు అని అర్ధం.
త్రిమూర్తుల భార్యలు ఎవరికివారు తమని మించిన పతివ్రతలేదని గర్వితులయ్యారని గ్రహించిన నారద మహర్షి, వారికి కనువిప్పు కలిగించదలచి ఒకనాడు త్రిమూర్తుల భార్యల వద్దకు ఇనుప గింజలను పట్టుకుని ఒక్కొక్కరి వద్దకు విడివిడిగా వెళ్లి గింజలను వేయించియిస్తే తిని క్షుద్బాధని తీర్చుకుంటానని కోరతాడు. అవి ఇనుప గింజలు కనుక ముగ్గురూ నిస్సహాయిలై వాటిని ఎవరూ వండలేరని అంటారు.అప్పుడు నారద మహర్షి పతివ్రతలకు సాధ్యంకానిదంటూ ఏమీ ఉండదు, కనుక నేను ముల్లోకాల్లోనూ మహాపతివ్రత అని కీర్తించబడుతున్నఅనసూయా మాతనే ఆశ్రయిస్తానని చెప్పి అత్రి మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్తాడు. అవే ఇనుప గింజలను అనసూయా మాతకిచ్చి వాటిని వేయించి పెడితే ఆకలి బాధ తీర్చుకుంటానని చెప్తాడు. అనసూయా మాత మనసులో తన భర్తని స్మరించి వాటిని వేయించి ఇస్తుంది. నారద మహర్షి తృప్తిగా ఆరగించి, జరిగిన విషయాన్ని ముగ్గురమ్మలకూ చెప్తాడు. ఈ విషయాన్ని నమ్మలేని అమ్మలు ముగ్గురూ త్రిమూర్తులని అనసూయా మాత పాతివ్రత్యాన్ని పరీక్షించవలసిందిగా కోరతారు.
తమ భార్యల కోరిక తీర్చదలచిన త్రిమూర్తులు, అత్రి మహర్షి అనుష్టానానికి వెళ్లిన సమయం చూచి మారువేషంలో ఆశ్రమానికి వస్తారు. అతిధులను ఆహ్వానించిన పిదప "మహర్షులవారు అనుష్టానానికి వెళ్లారు కనుక మీకు ఏ విధంగా సేవ చేయగలనని" అనసూయా మాత అడుగుతుంది. తమకు ఆకలిగా ఉందని త్వరితగతిన తమకు భోజనం పెట్టమని అడిగి, వివస్త్రయై భోజనం వడ్డిస్తేనే తాము ఆహారం స్వీకరిస్తామనే షరతు విధిస్తారు. భోజన సమయంలో వచ్చిన అతిధిని ఆకలితో తిప్పి పంపితే, గృహస్తు పుణ్యమూ, తపస్సు వచ్చిన అతిధుల వెంట వెళ్తాయని శాస్త్ర వచనం. పరపురుషుని ఎదుట నగ్నంగా నిలిచినట్లయితే పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. ఇలా అనసూయామాత పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుకున్నప్పటికీ, అత్రి మహర్షుల వారి సాంగత్యం వల్ల తాను పవిత్రురాలినైనందుకు భయపడవలసిన పనిలేదని తలచి అయ్యలారా మీరు ఆసీనులుకండని చెప్పి ఆహారపదార్ధాలు తీసుకురావడానికి వెళ్లింది. పతియే దైవమని తలచే నాకు, పాతివ్రత్యం గురించి భయపడనవసరంలేదని వివస్త్రయై వడ్డించడానికి అతిధుల ముందుకు వచ్చింది. ఆమె పాతివ్రత్య మహిమవల్ల త్రిమూర్తులు ముగ్గురూ పసిపాపలైపోయారు. ఆ పసిపాపలను చూడగానే అనసూయామాతకు మాతృభావం వల్ల స్తన్యం వచ్చింది, వారికి పాలిచ్చి నిద్రపుచ్చుతు ఉండగా అత్రి మహర్షులవారు వస్తారు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్న మహర్షుల వారు స్తోత్రం చేస్తారు. స్తోత్రానికి మెచ్చి త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు. సంతానాపేక్షతో వున్న మాకు మీరే పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించమని కోరుకొంటారు, తధాస్తు అని దీవించి త్రిమూర్తులు అంతర్ధానమవుతారు.
పతిలోని దైవాన్ని నమ్మి సాధన చేస్తున్న సాధకురాలికి గర్వం పనికిరాదు, గర్వం ఙ్ఞానసముపార్జనకి పెద్ద అడ్డంకి. సాధకురాలికి ఙ్ఞానం సిద్ధించిన తర్వాత ఆమెకు సాధ్యం కానిదంటూ ఉండదు. ఙ్ఞానాన్ని పొందినవారంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకుని వారిలో ఐక్యమైనవారని అర్ధం. భగవంతునితో ఐక్యమైనవారికి సాధ్యం కానిది ఏముంటుంది.?

భగవంతుని అవతారాలు :
పరమ భాగవతుడైన అంబరీష మహారాజుకి, దూర్వాస మహర్షి ఇచ్చిన శాపాన్ని అల్పుడైన తన భక్తుని బదులుగా తాను అనుభవించడానికి భగవంతుడు ఇరవై నాలుగు అవతారాలెత్తాడు. తన సృష్టి రచనలో భాగంగా సృష్టి,స్థితి,లయ లనే పరిణామక్రమంలో ఙ్ఞానం సముపార్జించే అవకాశం కలిగిన మానవులని సృష్టించాడు.ఆ మానవులకి అంతిమ లక్ష్యంగా మోక్షసాధనని ఏర్పరచాడు.మోక్షసాధనకి ధర్మ మార్గాన్ని అవలంభించడమే సరైన మార్గంగా నిర్ణయించి వేదాలని అందించాడు. ఙ్ఞానం సామాన్యులకి అందుబాటులోకి రావడం దుర్లభం అని తలచి తానే వారికి సులువైన రీతిలో ధర్మాన్ని బోధించదలచి ప్రధమంగా శ్రీ గురుదత్తునిగా అత్రి, అనసూయలకి జన్మించాడు. ఇది భగవంతుని ఆవతారపరంపరలో ఆరవది. ఈ అవతారం యొక్క విశిష్టత ఏమిటంటే - మిగిలిన అవతారాలన్నీ తమ తమ కార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి, కానీ దత్తావతారం నాలుగు యుగాల్లోనూ ఉంటూ, యుగాంతం తర్వాత కూడా ఉంటుంది. ప్రతి యుగంలోనూ మానవాళికి ఙ్ఞానం ప్రసాదించడానికి ఈయన ఒక లక్షా ఇరవై ఐదువేల మంది అవధూతలు, మహాత్ముల రూపంలో అవతరిస్తుంటాడు. ఈ అవతారం శాశ్వతం. పరమాత్మకి అభిన్నం.
దత్తాత్రేయుల వారి జన్మ వృత్తాంతం :
బ్రహ్మ తన శరీరావయవాల నుండి 1.మరీచి 2.అత్రి 3.అంగీరసుడూ 4.పులస్త్యుడు 5.పులహుడు 7.క్రతువు 8.భృగువు 9.వశిష్టుడు 10.నారదుడు. , అనే పదిమంది పుత్రులను ఉద్భవింపజేసాడు. అయినా తన సృష్టికి సంతృప్తి చెందక తన దేహంలో ఒక భాగం నుండి స్వాయంభువ మనువును పురుషుడిగాను, రెండవ భాగం నుండి శతరూపను స్త్రీగాను ఉద్భవింపజేసాడు. వీరి కలయిక వలన సృష్టి ప్రారంభమైంది. వీరికి 1.ప్రియవ్రతుడు 2.ఉత్తానపాదుడు అనే కుమారులు, 1.అకూతి 2.దేవహూతి 3.ప్రసూతి అనే కుమార్తెలు కలిగారు. అకూతిని ఋచి అనే మునికి,దేవహూతిని కర్దమ మునికి, ప్రసూతిని దక్షునకి ఇచ్చి వివాహం చేసారు.
కర్దమ ప్రజాపతి సంతానం కోసం చేసిన తీవ్ర తపశ్చర్యకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తానే పుత్రునిగా అతనికి జన్మిస్తానని వరమిచ్చాడు. కర్దమునికి దేవహూతి యందు 1.కళ 2.అనసూయ 3.శ్రద్ధ 4.హవిర్భువు 5.గతి 6.క్రియ 7.ఖ్యాతి 8.అరుంధతి 9.శాంతి అనే కుమార్తెలు కపిలదేవుడనే కుమారుడూ కలిగారు. అనసూయ మాతను, అత్రి మహర్షికిచ్చి వివాహం చేసారు.

అయ్యప్ప . స్వామి అయ్యప్ప


ఒమ్'అయ్యప్ప' హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడనికూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (=విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.
అయ్యప్ప పూజా కార్యక్రమము
అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
మహిషి కథనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసిబ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
ఛైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు జన్మించారు . జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు -- మకర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరందేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువుమోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసిశివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజుశనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికాలగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు. ఇతడుశైవుల కు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.
మస్కట్‌లో అయ్యప్ప పూజ - పూజా మంటపం శబరిమలై లోని దేవాలయం నమూనాలో కట్టబడింది.
అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పాఅని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువుఅయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలోవిద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల నమ్మకము
శబరిమల
శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.
దేవాలయ నిర్మాణము
అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ధి చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులుకార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణభారతదేశము లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుమరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది.
పూజా విధానాలు
నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్ష, మాల, నియమాలు
భక్తులు కార్తీకమాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం (41 రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (ఆరు సార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
ఇరుముడి
రెండు అరలువున్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు. ఇరుముడిలో1. నేతితో నింపిన కొబ్బరికాయ 2. రెండు కొబ్బరి కాయలు 3. వక్కలు 4. తమలపాకులు 5. నాణాలు 6. పసుపు 7. గంధంపొడి 8. విభూతి 9. పన్నీరు 10. బియ్యం, 11. అటుకులు, 12. మరమరాలు, 13. బెల్లం/అరటిపళ్ళు 14. కలకండ 15. అగరువత్తులు 16. కర్పూరం 17. మిరియాలు (వావర్‌ దర్గాకోసం) 18. తేనె 19. ఎండు ద్రాక్ష 20. తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను 'ఇరుముడి'గా కట్టుకునే ఉత్సవాన్ని'కెట్టునిరా' లేదా 'పల్లికెట్టు' అంటారు.
పడిపూజ
అయ్యప్ప స్వామి
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.[2].
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -
హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
ముఖ్య వ్యాసము: శబరిమల
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.
ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల") . ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.
పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట) . ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి రెండు రాల్లాని తీసుకు వెళతారు. ఆ రాల్లా "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి కరిమలా కొండ చేరుకుంటారు. కరిమలా కొండ ఎక్కడము చాలా కటినముగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు.కరిమలా కొండ చేరుకునేందుకు ఎంత కష్టముగా ఉంటుందో ఎటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు వణుకుతుంటయాని, ఎక్కడ లోయలో పడిపోతామని కూడా భయపడకుండా "స్వామియే శరణం అయ్యప్పా" అంటూ వేడుకుంటే సాక్షాత్తు జ్యోతిస్వరుపూలు హరిహరపుత్రుడు అయ్యప్పాస్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాములా రూపంలో వచ్చి భక్తులను సన్నిదానం వరకు తీసుకెళ్ళి దర్శనం ఇవ్వడంతోపాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేదపండితులు అంటారు. పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండాపంబ నది చేరుకుని పంబలో స్నానం చేసిన తరువాత భక్తులు పెద్ద పాదంలో పడిన కష్టాలను మరచిపోవడంతోపాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు. అక్కడే "పంబ" అనేగ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.
చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.
సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడి నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.
సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 41 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఒక వేలా 41 రోజులు దీక్ష చేయకుండా "పదునెట్టాంబడి"ఎక్కినచో ఆయా భక్తులా కోరికలు తిరవని వేదపండితులు అంటారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.
సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.
ఇతర విశేషాలు
మణికంఠుడు అని : తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం!నల్లని వస్త్రాలు :బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు తెలియజేశాడు.

కష్టాన్ని నమ్ముకోన్న వారు ఎన్నడూ నష్టపోరు

ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతు కనిపించాడు..
నేను రోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు
అని సందేహము కలిగినది.
వెంటనే మారు వేషం లో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు.
రైతు
నాకెందుకో ఈ రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను
అన్నాడు.
ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు.
కాని రైతు దున్నడము మానలేదు.
ఇంద్రునికి కోపము వచ్చిన్ది.
వరుణుడి ని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు.
వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రమ్ నేను ఏమీ చేయ్యలేనన్నాడు..
పవనుడి ని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకుడదు అని చెప్పాడు.
దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు.
ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు ,
కప్పల నాయకుడు మేము ఈ రోజు అస్సలు అరవము...కానీ మినుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు..
ఇంద్రుడు వాటినీ పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు,
అవి సరే మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి.
ఇంద్రుడు ఇంక వర్షం యెలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు..
కానీ ఆ రాత్రి వర్షం కురిసింది..
ఇంద్రునికి అవమానం తొ పట్టరాని కోపము వచిన్ది.
అందరినీ పిలిపిన్చాడు.
వరుణుడు చల్లగాలి వీచిన్ది మహరాజ అన్నాడు..
పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నడు...
కప్పలు మినుగురులు మిణుకు మిణుకు మని మేరవడమ్ వల్లే అరిచాము అన్నవి..
మిణుగురు పురుగులు మేము మాత్రమ్ అస్సలు బయటకు రాలేదు అన్నవి...
ఇంద్రుని కి ఏమీ జరిగిందో పాలుపోలేదు..
నారదుని కి విన్నవించారు.
నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు.
ఆ రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు..
ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి..
కప్పలు అరవడం తొ చల్లటి గాలి వీచిన్ది...
దానితో వర్షం కురిసింది అని చెప్పాడు..

శిఖండి పూర్వజన్మవృత్తాంతం

సుయోధనుని కోరికపై భీష్ముడు శిఖండి గురించి చెప్పసాగాడు " సుయోధనా ! నేను రాజ్యాధికారం వహించనని వివాహం చేసుకోనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేసాను. కనుక నా తండ్రి మరణానంతరం నా తమ్ముడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసాను. దుందుడుకు స్వభావం కలిగిన చిత్రాంగధుడు గంధర్వునితో తలపడి అతడి చేతిలో మరణించాడు. ఆ తరువాత విచిత్రవీర్యునికి రాజ్యాభిషేకం చేసాను. అతడికి వివాహ వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు నేను అతడి కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకుని బలవంతంగా హస్థినాపురానికి తీసుకువచ్చాను. వారిని ముగ్గురిని విచిత్రవీర్యుని వివాహం చేసుకొమ్మని చెప్పాను. వారిలో అంబ అప్పటికే సాళ్వుని ప్రేమించి ఉంది ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు నాకూ ఆ విషయం తెలియకుండా ఆమెను హస్థినకు తీసుకు వెళ్ళాను. అంబ నాతో " మీరు ధర్మాత్ములు నేను మనసారా సాళ్వుని ప్రేమించాను కనుక మనసులేని మనువు చేసుకొనజాలను నన్ను సాళ్వుని వద్దకు పంపించు " అని అడిగింది.
నేను నా తప్పు గ్రహించి ఆమెను సాళ్వుని వద్దకు పంపాను కాని అతడు " భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకు వెళ్ళాడు కనుక నేను నీ కన్యాత్వాన్ని నమ్మజాలను కనుక తిరిగి అతని వద్దకే వెళ్ళు " అన్నాడు. ఆమె జరిగినది అంతా వివరించి సాళ్వుని ఎంత వేడినా ఫలితం శూన్యం. ఆమె ఇదంతా భీష్ముని వలనే జరిగిందని చింతించి అతనిపై ఎలాగైనా పగతీర్చు కోవాలని నిర్ణయించుకుని మహా వీరుడైన భీష్ముని జయించడానికి తపస్సు తప్ప మరే మార్గం లేదని గ్రహించి తపోభూమికి చేరుకుంది. అక్కడ ఉన్న మునులకు తనగాధ వివరించింది. వారు ఆమెకు తపస్సు స్త్రీలకు కఠినమని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పారు. ఆమె వారితో " అయ్యా ! నేను ఇక నా తండ్రి వద్దకు కాని , బంధువుల వద్దకు గాని వెళ్ళలేను. కనుక ఇక్కడ తపస్సు చేసుకోవడమే నా నిర్ణయం " ఆ సమయంలో అక్కడకు వచ్చిన హోత్రవాహనుడు అనే రాజర్షి అక్కడకు వచ్చి అంబను గురించి తెలుసుకుని " అంబా ! నీవు నాకు వరసకు మనవరాలివి. నిష్కారణంగా శిక్షింపబడిన నీవు తపసు చేయడమెందుకు ? ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను నీకు అపకారం చేసిన భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్ళి సహాయం అడిగావంటే అతడు తన శిష్యుడైన భీష్మునికి చెప్తాడు అతని మాటను భీష్ముడు మీరజాలడు " అన్నాడు.
శ్హిష్యుడు చెప్పిన విధంగా పరశురాముడు హోత్రవాహనుడి ఇంటికి వచ్చాడు. హోత్రవాహనుడు పరశురాముని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించిన పిదప అంబ వృత్తాంతం వివరించాడు. పరశురాముడు అంబను చూసి " అంబా ! నీకు భీష్ముడు, సాళ్వుడు ఇద్దరూ అపకారం చేసారు. నేను ఎవరిని శిక్షించాలో నీవే విర్ణయించు " అన్నాడు. అంబ " మహాత్మా ! ఏది ఏమైనా సాళ్వుడు ఇక నన్ను స్వీకరించడు. కనుక భీష్ముని వద్దకు వెళ్ళి న్యాయం అడగాలి " అన్నది. పరశురాముడు అంబను వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చాడు. అతడు ముందుగా సరస్వతీ తీరాన విడిది చేసి నాకు వర్తమానం పంపాడు. నేను గురువుగారిని దర్శించి అర్గ్యపాద్యములు సమర్పించి సత్కరించాను. నా వినయ విధేయతలకు సంతోషించిన పరశురాముడు " గాంగేయా ! ఈ కన్యను బలవంతంగా ఎందుకు తెచ్చావు. వచ్చిన తరువాత తిరస్కరించడం ధర్మమా ! " అని అడిగాడు. నేను ఆమె ప్రేమవృత్తాంతం విని ఆమెను సాదరంగా సాళ్వుని వద్దకు పంపాను ఇందు నా అపరాధం ఏమున్నది " అన్నాను.
పరశురాముడు కోపించి అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయకున్న నిన్ను నీ బంధు మిత్రులను, పరి వారాన్ని నాశనం చేస్తాను " అన్నాడు. భీష్ముడు " నాకు విద్య నేర్పిన నీవే నా మీద కోపించడం తగునా ! " అన్నాను. పరశురాముడు " గాంగేయా ! నీవెన్ని చెప్పినా నీవు అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయనిదే నా కోపం తగ్గదు " అన్నాడు. నేను " గురువర్యా ! మీరు నన్ను అధర్మం చెయ్యడానికి పట్టుబడుతున్నారు. వేరొకరి మీద మనసు పడిన కన్యను నేను ఎలా నా తమ్మునికిచ్చి పరిణయం చేయగలను. ఇంతకన్నా మీ ఆగ్రహానికి గురి కావడమే మేలు. అధర్మానికి పురికొల్పే వాడు గురువైనా దండనార్హుడే అని పెద్దలు చెప్పారు కదా ! " అన్నాడు. పరశురాముడు ఆ మాటలకు కోపించి గాంగేయా ! యుద్ధానికి సిద్ధంగా ఉండు " అన్నాను నేను " గురువర్యా ! మీరు ఇదివరకే అహంకరించి క్షత్రియ వంశం నాశనం చేసారు. అప్పుడు భీష్ముడు లేడు ఇప్పుడు ఉన్నాడు. ఇక మీ ఆటలు సాగవు నేను యుద్ధం చేయ సిద్ధంగా ఉన్నాను " అన్నాను.
నేను నా తల్లి సత్యవతీదేవికి జరిగినది వివరించి ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యాను. నా తల్లి గంగాదేవి ఇది విని పరశురాముని చూసి నచ్చ చెప్పబోయింది ఆయన వినక పోవడంతో ప్రయోజనం లేదని ఆమె వెను తిరిగింది. అకృతవర్ణుని సారధ్యంలో పరశురాముడు యుద్ధభూమికి వచ్చాడు. నేను నా గురువుకు నమస్కరించి యుద్ధం ఆరంభించాను. పరశురాముడు నాపై శరవర్షం కురిపించాడు. నేను వాటిని అన్నిటినీ తుంచి పరశురాముని విల్లు విరిచాను అతడు మరో విల్లు తీసుకున్నాడు. నా బాణప్రయోగంతో అతని ఒళ్ళంతా తూట్లు చేసాను. అధిక రక్త స్రావం వలన పరశురాముడు మూర్చిల్లాడు. అతడిని చూసి నన్ను నేనే నిందించుకున్నాను. పరశురాముడు తేరుకుని నా పై అస్త్రం సంధించాడు. అది ఏమి అస్త్రమో నాకు తెలియదు అది నన్ను గాయపరిచింది సారధి నన్ను పక్కకు తీసుకు వెళ్ళాడు. ఇంతలో నేను తేరుకుని పరశురాముని బాణాలతో ముంచాను. ఈ విధంగా మేమిరువురము ఘోరంగా ఇరవై రెండు రోజులు యుద్ధం చేసాము.
చివరకు నేను పరశురామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్చిల్లాడు. అక్కడి మునులంతా వ్యాకులపడ్డారు. మూర్ఛలో నుండి తేరుకుని అతడు నా సారధిని చంపి నన్ను బాణాలతో కొట్టాడు. ఆ ధాటికి నేను మూర్ఛిల్లాను. ఆ సమయంలో బ్రాహ్మణులు కొందరు నాకు సేవ చేసారు. నా తల్లి గంగాదేవి నా రథం నడిపింది. నేను మూర్ఛ నుండి తేరుకున్నతరు వాత నా తల్లి నాకు రథం అప్పగించి వెనుతిరిగింది. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణులు కలలోకి వచ్చి భీష్మా మేము నీవు ఒక్కటే పరశురాముని జయించగల అస్త్రం ఇదొక్కటే అని నాకు మోహనాస్త్రం ఇచ్చారు. నేను దానిని ప్రయోగ ఉపసంహారాలతో అభ్యసించి యుద్ధానికి వెళ్ళాను. పరశురాముడు " నిన్న సగం చచ్చి వెళ్ళావు కదా ! ఈ రోజు నీ మదం అణచగలను రా అని నా పై అనేక బాణాలు సంధించాడు. నేను అతని పై శక్తి అస్త్రం ప్రయోగించాను. ఆ ప్రభావానికి అతడు మూర్ఛిల్లగా అకృతవర్ణుడు అతడిని మూర్ఛ నుండి తేరుకునేలా చేసాడు. ఆయన ఆగ్రహంతో నాపై బ్రహ్మాస్త ప్రయోగం చేసాడు. నేను ఆయన అస్త్రాన్ని అదే అస్త్రంతో నివారించాను. ఆ అస్త్రాలు లోకాల్లో విలయాన్ని సృష్టిస్తున్నాయి.
నేను అతడిపై మోహనాస్త్రాన్ని ఆవాహన చేసాను. ఇంతలో నారదుడు వచ్చి " గాంగేయా ! మోహనాస్త్రప్రయోగం నీకు ఉచితం కాదు అన్నాడు " అని వారించాడు. అష్ట వసువులు కూడా నన్ను వారించారు నేను వారి మాట విని బాణాన్ని ఉసంహారం చేసాను. పరశురాముని తండ్రి పితృ దేవతలతో వచ్చి " పరశురామా ! భీష్ముడు సామాన్యుడు కాదు అష్టవసువులలో అగ్రగణ్యుడు అతడిని గెలవడం ఎవరి తరం కాదు. నరనారాయణులలో ఒకరైన అర్జునుడు భీష్ముని సంహరించగల ధీరుడు . బ్రాహ్మణుడి వైన నీకు ఈ అనవసర యుద్ధం తగదు " అని జమదగ్ని చెప్పినా పరశురాముడు వినలేదు. నేను పట్టు వీడ లేదు. నా తల్లి గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది ఆమె చెప్పినా నేను విన లేదు. పలువురు పరిపరి విధాల మా ఇద్దరికి నచ్చ చెప్పి యుద్ధం మాన్పించారు.
బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి " గాంగేయా ! నీ గురువు అతి పరాక్రమ వంతుడు బ్రహ్మకోవిదుడు అయిన పరశురాముని వద్దకు వెళ్ళి నమస్కరించి క్షమాపణ అడిగి దీవెనలు అందుకో " అన్నారు. గంగాదేవి నారదునితో పరశురాముని వద్దకు వెళ్ళి " బార్గవరామా! దేవవ్రతుడు నీ శిష్యుడు అతడు ధర్మాన్ని విడువజాలక నీతో తలపడ్డాడు కాని నీపై విరోధం లేదు అతడిని దయతో మన్నించు " అని చెప్పారు. నేను పరశురామునికి నమస్కరించాను అతడు నన్ను మన్నించి నన్ను లేవనెత్తి వాత్సల్యంతో కౌగలించుకున్నాడు. అంబతో " అంబా ! చూసావు కదా ! నేను చేయగలిగినది చేసాను ఇక నీ దారి నువ్వు చూసుకో " అన్నాడు. అంబ " మహాత్మా ! మీకు వీలైనంత చేసారు. నేను తపమాచరించి నా పగ తీర్చుకుంటాను ఈ జన్మలో వీలు కాకున్న మరో జన్మలో తీర్చుకుంటాను " అని అక్కడ నుండి వెళ్ళి పోయింది.

ద‌త్తాత్రేయుడు

దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి.......!!
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది.
అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయ దేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘ అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది.
అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది.
అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను. ’ అని చెప్పుకొన్నది.
ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన
సంకల్పం వలన ఆమె భోజనంవడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొన్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను స్తుతించాడు.
అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘ సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతార కార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించాడు.....
మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణమే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి రోజున శ్రీ దత్త జయంతి జరుపుకుంటారు. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక మరియు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దత్త జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట మహరాజ్ మొదలగు అవతార పురుషులను శ్రీ దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణిస్తారు.
కర్ణాటకలోని గాణుగాపూర్, మహారాష్ట్రలోని కారంజ, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం ప్రసిద్ధ దత్త క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.