సమైక్యవాదిగా పేరు పడ్డ సీనియర్
కాంగ్రెస్ నేత, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకట్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
విభజన నేపథ్యంలో తీవ్ర బావోద్వేగానికి గురవుతున్నారు. తన సుధీర్ఘ రాజకీయ
gade venkat reddyచరిత్రలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని, అసలు
తెలంగాణ బిల్లు ఇంతదాకా వస్తుందని అనుకోలేదని ఆయన కళ్ల నీళ్లు
పెట్టుకున్నారు. అసెంబ్లీ వ్యతిరేకిస్తుందని తీర్మానం చేసిన బిల్లును
పార్లమెంటు ఆమోదించాలని చూడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయ
పడ్డారు.
తెలంగాణ వంటి నిర్ణయాన్ని అమలు చేయడం అంటే కష్టాలు కొనితెచ్చుకోవడమేనని, తెలంగాణ కోరుతున్నవారు తక్కువ అని, ఎన్ని కమిటీలు, నివేదికలు వచ్చినా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పాయని, వాటన్నింటిని తుంగలో తొక్కి విభజనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని గాదె ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి సమైక్యవాదిగా పేరు పడ్డ ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వదనే అనుకున్నారు.

No comments:
Post a Comment