Tuesday, July 18, 2017

కర్పూరం గురించి.

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
  1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
  2.  అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
  3.  పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
  4.  నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
  5.   కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
  6.   కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
  7.   కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
  8.   అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
  9.   కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
  10.   మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
  11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
  12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
  13.   దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
  14.   పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.
  15.   తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
  16.   పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.
  17.   కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.
  18.   అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.
  19.   కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.
  20.   కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.

Saturday, May 13, 2017

LIFE IS NOT FAIR FOR ANYONE --A lesson between two characters of Mahabharat

Karna asks Krishna - "My mother left me the moment I was born. Is it my fault I was born an illegitimate child? I did not get education from Dronacharya because I was considered a non- Kshatriya. Parshu-Ram taught me but then gave me the curse to forget everything since I was a kshatriya. A cow was accidentally hit by my arrow & its owner cursed me for no fault of mine. I was disgraced in Draupadi's swayamvar. Even Kunti finally told me the truth only to save her other sons. Whatever I received was through Dhuryodhana's charity. So how am I wrong in taking his side?"

Krishna replies, "Karna, I was born in a jail. Death was waiting for me even before my birth. The night I was born I was separated from my birth parents.

From childhood you grew up hearing the noise of swords, chariots, horses, bows and arrows. I got only cow herd's shed, dung, and multiple attempts on my life even before I could walk!

No army, no education. I could hear people saying I am the reason for all their problems.

When all of you were being appreciated for your valour by your teachers I had not even received any education. I joined gurukula of Rishi Sandipani only at the age of 16!

I had to move my whole community from the banks of Yamuna to far off Sea shore to save them from Jarasandh. I was called a coward for running away.

If Dhuryodhana wins the war you will get lot of credit. What do I get if Dharmaraja wins the war? Only the blame for the war and all related problems.

Remember one thing Karna. Everybody has challenges in life. LIFE IS NOT FAIR ON ANYBODY. Dhuryodhan also has a lot of unfairness in life and so as Yudhishtar.

But what is Right (Dharma) is known to your Conscience. No matter how much unfairness we got, how many times we were disgraced, how many times we were denied what was due to us, what is important is how you REACTED at that time. Stop whining Karna. Life's unfairness does not give you license to walk the wrong path of अधर्म.

🙏🕉🙏🕉🙏

Monday, January 2, 2017

*క్రైస్తవ మతప్రచారకుని తో జగద్గురువుల సంభాషణ -1973*


*శ్రీ గురుభ్యో నమః*

శ్రీ శ్రీ శృంగేరీ శారదా పీఠము యొక్క 35వ జగద్గురువులైన *శ్రీ అభినవ విద్యాతీర్థుల* వారి కాలములో [1973] ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.
గురువుల వద్దకు దర్శనానికి ఒక క్రైస్తవ మత ప్రచారకులు వచ్చినారు. ఆయన ఉద్దేశము, వారి మతము సర్వశ్రేష్ఠమయినది, కాబట్టి తమ మతానికి జనులను ఆకర్షించి వారికి స్వర్గ ప్రాప్తికి మార్గాన్ని చూపించవలెను. అందు కోసము జగద్గురువులను ఒప్పించి జనాలను క్రైస్తవ మతానికి చేర్పించాలని కోరడానికి వచ్చినారు. విషయము తెలిసిన జగద్గురువులు, వారిమతపుగొప్పదనము యేమిటోతెలుసుకోవలెనని ఆదరముతో ఆహ్వానించిసంభాషించారు.
యోగక్షేమాలు, కుశల ప్రశ్నల తర్వాత జగద్గురువులు అడిగినారు,
*జగద్గురువులు:*" మీరు ఇక్కడికి వచ్చిన కార్యమేమిటి?"
*క్రైస్తవ మత ప్రచారకులు [ క్రై. మ. ప్ర. ]:* స్వామీ, నేను మీ ఊరిలో, మీ మఠము సమీపములో ఒక క్రైస్తవ సంస్థను తెరవాలనే ఉద్దేశముతో వచ్చినాను."
*గురువులు:* " ఇక్కడ సంస్థను తెరచుటకు కారణము?"
*క్రై. మ. ప్ర.:* "నేను ప్రజలకు ఇక్కడనుండే ధర్మోపదేశమును ఇవ్వాలని ఆశిస్తున్నాను. "
*గురువులు:*"మీరు ఉపదేశించునదియేమి?"
*క్రై. మ. ప్ర.:* "మా మతమును గురించి, దాని శ్రేష్ఠతను గురించీ, జనులకు ఉపదేశము చేసి, వారందరినీ మా మతానికి మార్చుకోవా లనుకొంటున్నాను."
*గురువులు:*" మీరు జనులకు ఉపదేశము ఇచ్చే ముందు నాకు కూడా మీ మతమును గురించి తెలిపితే, నేను కూడా తెలుసుకుంటాను గదా?"
*క్రై. మ. ప్ర.:*" అట్లే కానివ్వండి, మీరు నన్ను ప్రశ్నలు అడగండి, నేను వాటికి సూక్త సమాధాన ములనుఇవ్వగలవాడను
*గురువులు:* "మీ మతము మొదలై ఎన్ని సంవత్సరాలయినది?"
*క్రై. మ. ప్ర.:*"మా మతము పుట్టి 1973 సంవత్సరా లయినాయి "
*గురువులు:*"సంతోషము,మీ మతపు ఆరంభమును గుర్తించుటకు ఒక నిర్దిష్టమైన కాలము, సమయము ఉన్నాయని స్పష్టమైంది. మీ మతము పుట్టుటకు ముందుప్రజలు ఉన్నారా లేరా?మీ మతము లేనప్పుడు జనులు జీవిస్తుండేవారా లేదా?"
*క్రై. మ. ప్ర.:*" జనులే లేకపోతే మేముమతబోధ ఎవరికి చేస్తాము? మేము మా మత విషయములను నేర్చుకొని ప్రచారము చేయుటకు ముందుకూడా ప్రజలు ఉండనే ఉన్నారు.
*గురువులు:* మీ మతము లోకి జనులు మారితే వారికి కలుగు ప్రయోజన మేమి?"
*క్రై. మ. ప్ర.:*"మా మతము లో చేరిన వారందరికి మాత్రమే తప్పక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. నరకము తప్పుతుంది"
*గురువులు:*" సరే, *మీరు మీమతమునుఅనుసరించే వారికి మాత్రము స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు.ఇతరులకు నరకప్రాప్తి అంటున్నారు. కానివ్వండి, మీ మతము పుట్టుటకు ముందు బ్రతికి జీవించిన కోటానుకోట్ల ప్రజలు స్వర్గానికి వెళుతుండేవారా లేక నరకానికివెళుతుండేవారా?"*
*క్రై. మ. ప్ర.:*" వారంతా నరకానికే వెళుతుండే వారు.మా మత ధర్మాన్ని పాలించనందువల్ల"
*గురువులు:*" ఇదెక్కడి న్యాయము? ఈ కాలపు ప్రభుత్వాలూ,న్యాయస్థానాలు కూడా ఇటువంటి చట్టాన్ని చేయవు కదా!!, *మీరు మీ ధర్మాన్ని, నియమాన్నీ ఏర్పరచక ముందు ఉన్నవారు మీ ధర్మాన్ని పాలించుట లేదు అన్న కారణానికి వారునరకభాజనులవుతారుఅనేదిన్యాయమేనా?ముందెప్పుడో రచించ బోయే నియమాలను ఊహించుకొని వారు అనుసరించుటఎక్కడైనా సాధ్యమా? కాబట్టి, మీరు మీ మతమునకు సంబం ధించిన నియమాలను రచించుటకు ముందే ఉన్నవారు నరకానికే వెళ్ళినారు అని చెప్పుట సమంజసమా?*
*క్రై. మ. ప్ర:*[బిక్కచచ్చి], ఔను స్వాములూ, వారు అందరూ నరకానికి కాదు, స్వర్గానికే వెళ్ళి ఉండాలి"
*గురువులు:*" ఇది కూడా అన్యాయమే అవుతుంది, ఎందుకంటే *మీ మతపు నియమాలను రాయుటకు ముందు పుట్టి పెరిగిన వారందరూ స్వర్గానికే వెళ్ళేవారు కదా?ఇప్పుడు మీరు రచించిన మత నియమాల వల్ల, వాటిని అనుసరించే కొందరుమాత్రమేస్వర్గానికి వెళుతున్నారు. అనుసరించని వారు నరకానికే వెళుతారు అన్నట్లయింది కదా? అందువల్ల, మీరు మీ మత నియమాలను రచించకుండా ఉండి ఉంటే అందరూ తప్పక స్వర్గానికే వెళ్ళేవారు. ఇప్పుడు మీ నియమాల వల్ల అనేకులకు అన్యాయము జరిగింది కదా?"*
*క్రై. మ. ప్ర:*"[తన మాటల కు తానే చిక్కుకొని గాభరాపడి] స్వామీ!!, మీరు నన్ను ఇటువంటి ప్రశ్నలనుఅడుగుతున్నారే? దయచేసి నన్ను వదిలేయండి" అన్నాడు.
*గురువులు:*"సరే, అట్లాగే కానివ్వండి, ఆ సంగతి వద్దు. చూడండి, ఈ ప్రపంచములో ప్రజలు అనేక విధములైన దుఃఖ కష్టాలకూ, సుఖ సంతోషా లకూ లోనగుటను చూస్తున్నాము కదా, దానికేమిటి కారణము?"
*క్రై. మ. ప్ర:*"దీన్నంతటినీ భగవంతుడే చేసినాడు"
*గురువులు:*" ఒకడికి ముష్టి అడుక్కోవలసిన హీన స్థితినీ, ఇంకొకడికి దానము చేయునట్టి ఉత్తమ స్థితినీ దేవుడు అనాదిగాఇస్తున్నాడంటే, భగవంతుడు తనకు ఇష్టమైనవాడిని సుఖము లోనూ,తనకుఅప్రియమైన వాడిని దుఃఖములోనూ ఉండేటట్టు చేసినాడనే చెప్పవలెను కదా?"
*క్రై. మ. ప్ర:*"అది భగవంతుని స్వంత ఇఛ్చ,స్వామీజీ,మనమేమీ చేయలేము. ఆయన ఏమికావాలన్నా చేయగలడు.అది ఆయన ఇష్టము."
*గురువులు:*"భగవంతుడు ఏమి కావాలన్నా చేయవచ్చుఅన్నట్టయితే, అందరికీ సుఖాన్నే ఇవ్వవచ్చును కదా? ఆ సుఖాన్నికొందరికిమాత్రమే ఎందుకు ఇచ్చాడు?దానికి కారణమేమయి ఉంటుంది?"
*క్రై. మ.ప్ర:*"[అప్రతిభుడై], అదంతా భగవంతునికి చెందిన విషయము. నేనేమి చెప్పగలను?"
*గురువులు:* *మీవాదానికి ఒక యుక్తి గానీ, తర్కం గానీ ఉన్నట్టేకనిపించుట లేదు.*సరే,అదీ ఉండ నివ్వండి, మరొక విషయము!!, చిన్న పిల్లలుగా ఉన్నపుడే కొందరు చనిపోతారు. కొందరేమో వయసయిన తర్వాత.ఇలాగున్నపుడు, చిన్నపిల్లలు చనిపోయాక స్వర్గానికి వెళతారా లేక నరకానికా?"
*క్రై. మ. ప్ర.:*"చిన్నపిల్లలు పాపముఎలాచేయగలరు?వారు ఒక తప్పును కూడా చేయలేరు.వారింకా చిన్నపిల్లలే కాబట్టి వారికి పాపపుణ్యాల ప్రసక్తే రాదు. వారికి అవి అంటవు"
*గురువులు:*" అందుకే అడిగినాను,వారు వెళ్ళేది స్వర్గానికా,లేకనరకానికా?"
*క్రై. మ. ప్ర.:*"చిన్న పిల్లలందరూ స్వర్గానికే వెళతారు"
*గురువులు:*" అట్లయితే మన తల్లిదండ్రులంతా మన గురించి చాలా పెద్ద తప్పే చేసారనవలెను. మనలనందరినీ చిన్న పిల్లలుగా ఉన్నపుడే చావడానికివదిలేయకుండా పెంచి పోషించి పెద్ద చేసినారు. ఇది చాలా పెద్ద తప్పు కదా? శిశువులను పుట్టగానే చంపి వేసుంటే, మనము పెరిగి పెద్దయి, తప్పు చేసేందుకు అవకాశమే ఉండేది కాదు. మనందరకూ స్వర్గమే దొరికేది? కాదా?"
*క్రై. మ. ప్ర.:*"[ మరలా చిక్కుకొని], స్వామీ మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తే నేను జవాబివ్వలేను"
*గురువులు:*" సరే, వదిలేయండి, చనిపోయే వారందరూ స్వర్గానికో లేక నరకానికో వెళతారు తప్పదు కదా, ఎప్పుడు వెళతారు అన్నది చెపుతారా?"
*క్రై. మ. ప్ర.:*భగవంతునికి ఎప్పుడునిర్ణయించాలనిపిస్తే అప్పుడు నిర్ణయిస్తాడు, అప్పుడే పోతారు
*గురువులు:*ఇదేమయ్యా ఆశ్చర్యముభగవంతుడు పిచ్చివాడా యేమి!!, తనకిష్టమొచ్చినపుడు న్యాయ నిర్ణయము చేయుటకు?
*క్రై. మ. ప్ర.:*"అలాగ కాదు,అక్కడఅదంతటికీ ఒక క్రమ విధానము ఉంటుంది"
*గురువులు:*" సరే, మీ పుస్తకములో అదేమి క్రమ విధానమును వివరించారో కొంచము చెపుతారా? [ఆయన మాట్లాడేందుకు తటపటాయించినాడు; గురువులేకొనసాగించినారు] మీ మతములో ఈ విషయము గురించి ఏమి సిద్ధాంతము ఉందో, దాన్ని నేను చెపుతాను. అది సరియా కాదా మీరే చెప్పండి
*క్రై. మ. ప్ర.:*"కానివ్వండి స్వామీ, చెప్పండి"
*గురువులు:*"ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చనిపోయిన తరువాత, దేవుడు, ఏదో ఒకరోజు, న్యాయ నిర్ణయ మును చేసి, కొందరికి స్వర్గాన్నీ, కొందరికి నరకాన్నీ ఇస్తాడు.కదా!? సరియేనా?"
*క్రై. మ. ప్ర.:*"ఔనౌను, తమరు చెప్పింది సరిగ్గా ఉంది"
*గురువులు:*"ఈ ప్రపంచ ములోనే జరుగుతున్న సంగతిని చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఒక తప్పు చేసినారంటే, విచారణకు మొదట, ఆ తప్పు చేసినవాడిని పోలీసులు కొన్నిరోజులు నిర్బంధములో ఉంచు తారు. దాని తర్వాత కూడా అతడినిపోలీసులు లాకప్లోఉంచాలంటే, దానికి న్యాయాధీశుల అనుజ్ఞను పొందవలసి ఉంటుంది. అలాగ, కారణమూ, అనుమతీ లేకుండా, విచారణ చేయకుండా ఎక్కువ రోజులు ఉంచుటకు వీలు లేదు. న్యాయాధీశులు ఒప్పుకోకుంటే అతడిని పోలీసులు నిర్బంధము నుండీ వదిలివేయవలసి ఉంటుంది.ఇలాగున్నపుడు, ఒకడు మృతుడయిన తరువాత వాడికి, "ఈ ప్రపంచములో ఉన్న వారందరూ చచ్చిపోయే వరకూ, అనగా, కోటి కోటి సంవత్సరాలయ్యేవరకూ జనాలు పుట్టుతూ చస్తూ ఉంటారు కాబట్టి,అదంతా అయ్యే వరకూ, ’నువ్వు విచారణ లేకుండానే కాచుకొని ఉండాలి" అంటూ ఆ భగవంతుడు చెబితే,అది న్యాయమని అపించుకుంటుందా? మీరే చెప్పండి?"
జగద్గురువుల ఈమాటను విని ఆ క్రైస్తవ మత ప్రచారకుడుదిక్కుతోచని వాడైనాడు. అప్పుడు గురువులు ఆతనికి సమాధనము చెబుతూ,
*మీకుమీ మతమేగొప్పది. మీరు దానిని అత్యంత శ్రద్ధతోఅనుసరించవలెను.అంతే కానీ, ఇతరులతో, ’మా మతమే శ్రేష్ఠమైనది, దానినే అందరూ అనుస రించవలెను, అలాగ ఏమైనా మీరు మా మతాన్ని అనుసరించక పోతే మీకు, నరకమూ, దుఃఖమే గతి* అని చెప్పుట సాధువైనది కాదు. *మీకు మీ తల్లి పూజనీయురాలు. ఇతరు లకు వారి వారి తల్లులు పూజనీయులు.’మా తల్లి మాత్రమేపూజనీయురాలు,ఇతరుల తల్లులు కాదు* అంటూ మీరు చెప్పితే అది *మీ మూఢత్వమే* అవుతుంది. *నా తల్లి కూడా ఇతరుల తల్లుల వలె సమానముగా పూజనీయురాలు అని తెలుసుకున్నపుడే మనలను ప్రపంచము ఆదరిస్తుంది. లేకుంటే ఛీత్కరిస్తుంది.* అని ఉపదేశించినారు. ఆతడినివీడ్కొనునప్పుడు ఆతనికి జగద్గురువు లు ఎప్పటివలెనే ఫలమునిచ్చి సత్కరించి నారు. అతడు దానిని ఆదరముతో స్వీకరించి వెళ్ళిపోయినాడు.
ఆ తరువాత గురువులు భక్తులను ఉద్దేశించి ,
*సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|*
*అనేన ప్రసవిష్యధ్వమేష వోఽత్తిష్వ కామధుక్||*
"మొదట యజ్ఞములతో పాటు ప్రజలను సృష్టించి ప్రజాపతి,’ఈ యజ్ఞములు మీకు కామధేనువులగు గాక ’యని అంటాడు. బ్రహ్మ దేవుడు, జగత్తును సృష్టి చేయునపుడే అది సరిగ్గా నడుస్తూ ఉండుటకు అవసరమైన విధి-నియమములను రచించినాడు. ఇది మన మతపు గొప్పతనము. మన సనాతన ధర్మపు సిద్ధాంతము ప్రకారము, భగవంతుడు అనాది యైనవాడు. అలాగే ఈ ప్రపంచమూ,మనధర్మమూ కూడా అనాదిగా ఉన్నవి. జీవరాశులకు వాటి వాటి కర్మలకు తగినట్లు ఫలము ప్రాప్తిస్తుంది. దుష్టులకు దుష్టఫలము,సత్కర్ములకు మంచి ఫలము. కర్మలు అచేతనమైనవి-అంటే జడమైనవి.ఫలము నిచ్చేది భగవంతుడే.
భగవంతుడు దయాళువు అనునది దిటమైనమాట.. *తప్పుచేసినవాడు తన తప్పునుప్రామాణికముగా ఒప్పుకొని క్షమాభిక్ష వేడితే న్యాయాధీశులు శిక్షను తగ్గిస్తారు కదా? కానీ ఇతడు పదే పదే తప్పులు చేస్తూ ప్రతిసారీ క్షమాభిక్షను కోరితే న్యాయాధీశుడుక్షమిస్తాడా? భగవంతుడు కూడా అట్లే.*ప్రామాణికులైనవారిని క్షమిస్తాడు. కానీ పదే పదే తప్పుచేసే వాడిని ఖచ్చితముగాక్షమించడు. *మన శాస్త్రములు శ్రద్ధతో పాటూ వివేకము కూడా ఉండవలెనని బోధిస్తాయి.ఇతరమతాలు శ్రద్ధ ఒక్కటీ ఉంటే చాలని చెబుతాయి.* *మత ధర్మములలో భావుకత మాత్రమే కాక విచారము చేయు ప్రవృత్తి కూడా ఉండవలెను.*
శ్రీరామచంద్రుడు,శ్రీకృష్ణుడు వంటి అవతారాలు మన ధర్మములోమాత్రమే కనిపిస్తాయి.మనధర్మము వారివల్ల యేదో కొత్తగా స్థాపించబడినది కాదు. మన ధర్మము, అటువంటివారిని ఈ జగత్తుకు ప్రసాదించింది. *ఇంతటిమహాత్మ్యమున్న సనాతన ధర్మములో మనందరమూజన్మించాము. ఈ సనాతనధర్మపు బోధనలను పాటించి మనమందరమూ శ్రేయస్సుకుతగినవారము కావలెను.* అని ఉపదేశించినారు.
{శ్రీ శృంగేరీ శారదాపీఠము వారు కన్నడ భాషలో ప్రచురించిన *శృం
గేరీ పుణ్యక్షేత్రము* పుస్తకము నుండీ అనువాదము}